100 మందితో టీఆర్ఎస్ తొలి జాబితా సిద్ధం

15 మందిని తప్పించి.. మిగతా అందరికీ మళ్లీ సీట్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. ఇప్పటికే తొలి జాబితా

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే కార్పొరేటర్ అభ్యర్థుల విషయంలో క్లారిటీకి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ. గతంలో గెలిచిన 99 మంది అభ్యర్థుల్లో 15 మందిని తప్పించి.. మిగతా అందరికీ మళ్లీ సీట్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. ఇప్పటికే తొలి జాబితా సిద్ధం చేసిన పార్టీ.. 18వ తేదీ అధికారికంగా ప్రకటించనుంది. 100 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించటానికి అంతా సిద్ధం చేసింది.

నామినేషన్ల సమయంలోనే అభ్యర్థులకు బీ-ఫారాలు ఇవ్వకూడదని నిర్ణయించింది టీఆర్ఎస్ పార్టీ. నామినేషన్ల పరిశీలన సమయంలోనే బీ-ఫారం ఇవ్వాలని డిసైడ్ చేసి.. ఈ మేరకు అభ్యర్థులకు సమాచారం ఇచ్చింది. 100 మంది జాబితాను బుధవారం ఉదయం ప్రకటించి.. మిగతా అభ్యర్థులను కూడా ఫైనల్ చేసి.. గురువారం ఉదయం ప్రకటించాలని షెడ్యూల్ ప్లాన్ చేసింది.

అన్ని పార్టీల కంటే ముందుగానే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి.. ప్రచారంలోకి దిగాలని డిసైడ్ అయ్యింది. సమయం కూడా తక్కువగా ఉండటంతో.. అభ్యర్థుల ఎంపిక విషయాన్ని జఠిలం చేసుకోకూడదని.. వీలైనంత త్వరగా ప్రకటించేసి.. రోడ్డెక్కేయాలని నిర్ణయించింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు