జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్లటం టీఆర్ఎస్ పార్టీ సాహసమే అని చెప్పాలి

ఇన్ని రకాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ రెడీ కావటం

trs party logo

మరికొన్ని రోజుల్లోనే జీహెచ్ఎంసీ ఎన్నికల సమరానికి వెళ్లాలని టీఆర్ఎస్ పార్టీ తహతహలాడుతోంది. డిసెంబర్ 3వ తేదీన ఫిక్స్ చేసి.. ఓటర్ తీర్పు కోసం కోరాలని వార్తలు వస్తున్నాయి. దుబ్బాక ఫలితం చూసిన తర్వాత కూడా టీఆర్ఎస్ దూకుడుగా ఉండటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. హైదరాబాద్ సిటీ పరిధిలో ప్రజల్లో అసహనం ఉన్న మాటను అందరూ అంగీకరిస్తున్న టైంలోనూ.. టీఆర్ఎస్ పార్టీ మాత్రం ధీమా వ్యక్తం చేయటం విశేషం.

కరోనాతో ఎనిమిది నెలలుగా సరైన ఆదాయం లేదు. ఇలాంటి టైంలో ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చారు. ఆర్థిక ఇబ్బందులకు తోడు ప్రభుత్వం ఇలాంటి స్కీమ్ ఈ టైంలో తీసుకురావటం ఏంటనేది చర్చ జరుగుతుంది
వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు బురదలోనే ఉన్నాయి.
10 వేల నష్టపరిహారంపై బస్తీవాసులతోపాటు సామాన్యుల నుంచి విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. రోజురోజుకు ఈ నిరసనలు పెరుగుతున్నాయి.
ధరణి వెబ్ పోర్టల్ లో ఆస్తుల నమోదు అనేది తీవ్ర వ్యతిరేకత నెలకొంది. రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయి.. ఆస్తి పన్ను కడుతున్నాం.. వాటర్, కరెంట్ బిల్లు ఇన్ని కడుతున్నాం.. మళ్లీ ధరణిలో ఎందుకు నమోదు చేసుకోవాలనే ప్రశ్నకు సరైన సమాధానం లేదు

ముఖ్యంగా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టిన వేలాది మంది ఎన్నారైలు.. తమ ఆస్తులపై ఆందోళనగా ఉన్నారు.
అమీర్ పేట్ నుంచి అశోక్ నగర్ వరకు ఉన్న ఇతర రాష్ట్ర ప్రజల్లో ధరణి పోర్టల్ పై ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
కరోనాతో ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్లాడుతున్నారు. ఆర్థిక వ్యవహారాలు దారుణంగా దెబ్బతిని ఉన్నాయి.
కరోనా వైరస్ మహమ్మారి ఇంకా తగ్గలేదు. సెకండ్ వేవ్ వస్తుంది. వర్క్ ఫ్రమ్ హోంలో లక్షల మంది పని చేస్తున్నారు.

ఇన్ని రకాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ రెడీ కావటం సాహసమే అని చెప్పాలి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు