టీఆర్ఎస్ 20 గెలిస్తే చాలు.. మేయర్ పీఠం వచ్చేస్తోంది

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కలిపి మొత్తం

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పొడిచేస్తాం.. ఇరగదీసేస్తాం అంటూ ప్రగల్భాలు పలికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓ షాకింగ్. హైదరాబాద్ మేయర్ పీఠంపై మేమే ఉంటాం.. గోల్కొండ కోటపై జెండా ఎగురేస్తాం అనే బీజేపీకి అస్సలు సాధ్యం కాదు అంటున్నాయి లెక్కలు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ జస్ట్ 20 డివిజన్లలో గెలిస్తే చాలు.. మేయర్ పీఠం దక్కించుకుంటోంది.

150 సీట్లున్న గ్రేటర్‌ హైదరాబాద్ లో 76 డివిజన్లలో ఎవరు గెలుస్తారో వారిదే జీహెచ్ఎంసీ. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ కాస్త కష్టపడి కొద్దిగా అంటే 20 సీట్లు సాధించినా చాలు.. మేయర్ పీఠాన్ని దక్కించుకోవచ్చని లెక్కలు విప్పి చెబుతున్నారు. అందుకు కారణం.. ఎక్స్‌ అఫిషియో ఓట్లు. మేయర్‌ ఎన్నికలో ఎక్స్‌ అఫిషియో ఓట్లే కీలకం.

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కలిపి మొత్తం 56 ఎక్స్‌అఫిషియో ఓట్లున్నాయి. ఇందులో టీఆర్ఎస్, మజ్లీస్‌ పార్టీలకు 52 వరకు ఉన్నాయి. అంటే 150 కార్పొరేటర్లతో పాటు.. ఈ 56 ఎక్స్ అఫిషియో ఓట్లు కలిపి మొత్తం 206 ఓట్లలో సగానికి పైగా ఎవరికి దక్కితే వారిదే మేయర్ పీఠం. ఇక లెక్కల ప్రకారం.. టీఆర్ఎస్‌కు 42, మజ్లీస్‌కు 10 ఎక్స్ అఫిషియో ఓట్లున్నాయి. అంటే ఈ రెండు పార్టీలకు 52 ఓట్లు ఆల్‌రెడీ ఉన్నాయన్నమాట. పాతబస్తీలో ఎంఐఎం కోటలో ఎలాగైనా ఓ 30కి పైగా సీట్లు గ్యారెంటీ. మొత్తం 80కి పైగా ఆ రెండు పార్టీల ఖాతాల్లో ఓట్లున్నట్లే. ఇక టీఆర్ఎస్‌ సాధించాల్సింది కేవలం 15 నుంచి 20 సీట్లు మాత్రమే.

ఒక వేళ ప్రజా క్షేత్రంలో ఓడిపోయినా.. మరో మార్గంలో జీహెచ్ఎంసీని దక్కించుకోవటం ఖాయం అన్నమాట..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు