మెట్రో స్టేషన్ లోని రైలు పట్టాలపై ధర్నా – దేశంలోనే ఫస్ట్ టైం ఇలా

మెట్రో స్టేషన్ లోని రైలు పట్టాలపై ధర్నా - దేశంలోనే ఫస్ట్ టైం ఇలా.. మెట్రో పట్టాలపై ధర్నాతో మెట్రో సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. 30 నిమిషాలు ఎక్కడి రైళ్లు

ధర్నా, నిరసనలు అంటే బస్టాండ్లు, రోడ్లపై, రైలు పట్టాలపై చేయటం ఇప్పటి వరకు చూశాం.. ఫస్ట్ టైం మెట్రో రైలు పట్టాలపై టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగి కలకలం రేపారు. మంగళవారం హైదరాబాద్ కూకట్ పల్లి మెట్రో స్టేషన్ పైకి వెళ్లి.. పట్టాలపై కూర్చుని నిరసనకు దిగారు.

కూకట్ పల్లి నుంచి మియాపూర్ వెళుతున్న రైలు.. కేపీహెచ్ బీ స్టేషన్ ముందే నిలిచిపోయింది. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో మెట్రో స్టేషన్ పైకి వెళ్లి.. పట్టాలపై కూర్చున్న కార్యకర్తలను బలవంతంగా కిందకు తీసుకొచ్చారు.

మెట్రో పట్టాలపై ధర్నాతో మెట్రో సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. 30 నిమిషాలు ఎక్కడి రైళ్లు అక్కడే ఆగిపోయాయి. ఇలా చేస్తారని ఇప్పటి వరకు ఊహించలేదు ఎవరూ.. ఫస్ట్ టైం మెట్రో పట్టాలపై ధర్నాతో సంచలనం సృష్టించారు.

దేశవ్యాప్తంగా ఎన్నో ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు జరిగాయి.. అన్ని చోట్ల జరిగాయి. మెట్రో స్టేషన్లు, ఎయిర్ పోర్టుల్లో మాత్రం అందుకు మినహాయింపు ఉండేది. ఫస్ట్ టైం టీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం మెట్రో స్టేషన్ పైకి వెళ్లి.. పట్టాలపై కూర్చుని ధర్నా చేశారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు