కమలానికి కారు స్కెచ్.. ధీటుగా బీహార్ నుంచి దిగిన బీజేపీ వ్యూహకర్త

బీహార్‌లో బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించిన జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్‌కు గ్రేటర్ ఎన్నికల ఇంచార్జీ

దుబ్బాక విన్నింగ్‌ బూస్ట్‌తో ఏకంగా గ్రేటర్ పగ్గాలు అందుకోవాలని ఆశిస్తోన్న బీజేపీకి.. ఎస్‌ఈసీ అనుకోని రీతిలో షాకిచ్చింది. గ్రేటర్‌ ఎన్నికల ప్రక్రియ మొదలుపెడుతున్నట్లు ప్రకటించిన ఎన్నికల సంఘం.. ఏకంగా 13 రోజుల్లోనే పూర్తి చేస్తామని షెడ్యూల్ ప్రకటించింది. నామినేషన్లకు 3 రోజులు మాత్రమే సమయం ఇవ్వగా.. ప్రచారానికి అత్యంత తక్కువగా కేవలం 13 రోజుల సమయం మాత్రమే ఇచ్చింది. దీంతో ప్రణాళికలు రూపొందించేందుకు.. వ్యూహాలు అమలు చేసేందుకు.. ఓటర్లను ఆకర్షించేందుకు.. బీజేపీతో పాటు.. ఇతర పార్టీలకు అవకాశం సన్నGగిల్లినట్లైంది.

ఏకంగా 99 సీట్లతో గత ఎన్నికల్లో పాగా వేసిన అధికార కారు పార్టీ.. ఈ సారి టార్గెట్‌ను 135 కు పెంచుకుంది. ఇటీవల మంత్రి కేటీఆర్‌.. బల్దియాలో మరోసారి బంపర్ హిట్ కొడతామని ప్రకటించారు. గ్రేటర్‌పై చాలా కాలం నుంచే వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. వార్‌లో టీఆర్ఎస్‌ ఇతర పార్టీలకు అందనంత మేర ముందుంది. దుబ్బాక దెబ్బతో పాటు.. ఇటీవల నగరంలో కురిసిన భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని ఇతర పార్టీలు అనుకూలంగా మార్చుకోకుండా గులాబీ పార్టీ తన అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోంది.

ఆస్తిపన్ను తగ్గింపు.. త్వరలో కొత్త జీహెచ్‌ఎంసీ చట్టం వంటి హామీలు ఇప్పటికే ప్రకటించిన టీఆర్ఎస్.. గ్రేటర్‌లో కమలానికి బ్రేక్ వేసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. బీజేపీ కేంద్ర నాయకత్వం గ్రేటర్‌ ఎన్నికలపై ఫోకస్ చేస్తోంది. బీహార్‌లో బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించిన జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్‌కు గ్రేటర్ ఎన్నికల ఇంచార్జీ బాధ్యతలు అప్పగించింది. కాంగ్రెస్‌, మజ్లీస్‌ పార్టీలతో గ్రేటర్‌ వార్.. మరింత రంజుగా మారనుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు