ట్రంప్ డ్రెస్సింగ్ స్టైల్ మారింది

ట్రంప్ డ్రెస్సింగ్ స్టైల్ మారింది

అమెరిగా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పొడిపోయారు. డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ చేతిలో ట్రంప్ ఓటమి చెందారు. ఈ ఎన్నికల్లో జో బిడెన్ 284 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా ట్రంప్ 214 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావాలి అంటే 270 ఎలక్టోరల్ ఓట్లు రావలసి ఉంటుంది. అయితే బిడెన్ 284 ఓట్లు సాధించారు. దింతో బిడెన్ విజేతగా ప్రకటించారు. ఇక ట్రంప్ ఓటమిని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ట్రంప్ కూడా తన ఓటమిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇంకా గెలుపు డిక్లర్ కాలేదని ట్రంప్ భావిస్తున్నారు. మరోవైపు బిడెన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే లండన్ లోని టుసాడ్స్ మ్యూజియంలో ట్రంప్ విగ్రహం డ్రెస్ కోడ్ చేంజ్ చేశారు. ఇంతకాలం సూటు బూటూ వేసి ఉన్న ట్రంప్ విగ్రహానికి, వాటిని తొలగించి గోల్ఫ్ క్రీడాకారుల డ్రెస్ వేశారు. కాగా ప్రస్తుతం దానికి సంబందించిన ఓ ఇమేజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అధ్యక్షా ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోవడంతో అతడికి దుస్తులు మార్చినట్లు మ్యూజియం నిర్వాహకులు తెలిపారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు