కర్ఫ్యూ లేదా లాక్ డౌన్ : 48 గంటల్లో తేల్చండి – తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

telangana high court comments on govt

కరోనా కట్టడి.. వైరస్ వ్యాప్తి విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని.. పట్టించుకోవటం లేదంటూ హైకోర్టులో దాఖలు అయిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేసింది.

ఏప్రిల్ 19వ తేదీన తెలంగాణ హైకోర్టులో.. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి, ఇతర అంశాలపై విచారణ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటుందని అసహనం వ్యక్తం చేసింది. రద్దీ ప్రాంతాలు, బార్లు, పబ్బులపై ఆంక్షలు విధించటానికి ఎందుకు వెనకాడుతోంది అని ప్రశ్నించింది. కరోనా కట్టడికి కర్ఫ్యూ లేదా లాక్ డౌన్.. రెండింటిలో ఏదో ఒకటి తేల్చుకోవాలని.. ఏదో ఒక విధానంలో ముందుకు వెళ్లాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఏప్రిల్ 22వ తేదీలోపు.. అంటే 48 గంటల్లో ఏదో ఒకటి విషయం తేల్చుకోవాలని.. లేకపోతే హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందంటూ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చింది. హైకోర్టులో విచారణకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ హాజరయ్యారు. విచారణను ఏప్రిల్ 23వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.

కరోనా కట్టడిపై తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ.. ప్రభుత్వం, పోలీస్ శాఖ, హెల్త్ డిపార్ట్ మెంట్ ఇచ్చిన నివేదికలు సరిగా లేవని అభిప్రాయపడింది హైకోర్టు. RT-PCR టెస్ట్ 24 గంటల్లో వచ్చేలా చర్యలు తీసుకోవాలని.. ఇది వెంటనే అమలు కావాలని ఆదేశించింది హైకోర్టు.

తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో జనంలో టెన్షన్ మొదలైంది. కర్ఫ్యూ పెడతారా లేక లాక్ డౌన్ విధిస్తారా.. రాబోయే రెండు రోజుల్లో ఏం చర్యలు ఉండబోతున్నాయి అనే టెన్షన్ మొదలైంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు