తిరుమల టికెట్లు 15 వేలు మాత్రమే.. 20 నిమిషాల్లోనే శ్రీవారి దర్శనం.. ఎక్కడా ఆగేది లేదు..

ttd issues 15 k tickets on behalf of covid virus

కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న క్రమంలో తిరుమల పాలక మండలి బోర్డు.. కొత్త ఆంక్షలు విధించింది. ఇక నుంచి 15 వేల మందికే దర్శనం టికెట్లు జారీ చేయనుంది. అది కూడా 300 రూపాయల టికెట్లు మాత్రమే. ప్రస్తుతం 30 వేల మందికి టికెట్లు జారీ చేస్తుండగా.. ఈ సంఖ్యను సగానికి తగ్గిస్తుంది. ఏప్రిల్ 22వ తేదీ వరకు 30 వేల టికెట్లు విక్రయించింది బోర్డు.. అయితే వీరిలో 10 వేల మంది దర్శనానికి రాలేదు.. వీళ్లకు రాబోయే 90 రోజుల్లో దర్శనం చేసుకోవచ్చని వెసలుబాటు కల్పించింది.

తిరుపతి కేంద్రంగా కరోనా కేసులు తీవ్రంగా ఉన్నాయి. రోజురోజుకు పెరుగుతున్నాయి. ఏపీలో ఏప్రిల్ 18వ తేదీ ఒక్క రోజే 6 వేల కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే తిరుమల ఆలయ సిబ్బంది, ఉద్యోగులు, పూజారుల భద్రతపై దృష్టి పెట్టటంతోపాటు.. భక్తుల రూపంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది బోర్డు.

రోజువారీ దర్శనం టికెట్ల జారీని 15 వేలకు కుదించటం ద్వారా.. నేరుగా శ్రీవారిని దర్శనం చేసుకునే వెసలుబాటు వస్తుంది. 300 రూపాయలు టికెట్ ఉన్న వారు.. క్యూ లైన్ లో నేరుగా శ్రీవారిని దర్శనం చేసుకుని బయటకు రావాల్సి ఉంటుంది. కంపార్ట్ మెంట్లు అన్నీ మూసి వేయటం ద్వారా.. భక్తుల సమూహాన్ని అరికట్టటం జరుగుతుందన్నారు అధికారులు.

300 టికెట్ తీసుకున్న వారు.. 20 నిమిషాల్లోనే శ్రీవారి దర్శనం అయిపోయే విధంగా ప్లాన్ చేస్తున్నారు అధికారులు. ఇక కొండపై ఒక రోజు కంటే ఎక్కువగా గదులు కేటాయించటం లేదు. 24 గంటల్లోనే తిరుమత కొండను భక్తులు ఖాళీ చేయాలని స్పష్టం చేస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు