వారం రోజుల్లో ఇద్దరు అండర్ వరల్డ్ డాన్లు మృతి.. ఇద్దరూ ఒకే జైలులో.. కరోనా కాటు వేసింది

వారం రోజుల్లో ఇద్దరు అండర్ వరల్డ్ డాన్లు మృతి.. ఇద్దరూ ఒకే జైలులో.. కరోనా కాటు వేసింది

dons
dons

వారం రోజుల్లో ఇద్దరు అండర్ వరల్డ్ డాన్లు మృతి.. ఇద్దరూ ఒకే జైలులో.. కరోనా కాటు వేసింది

భారతదేశంలో కరోనా ఏ స్థాయిలో ఉంది అంటే.. వ్యవస్థలు చేయలేని పనిని కరోనా చేసుకుంటూ పోతుంది. వారం రోజుల్లో.. అంటే సరిగ్గా ఏడు రోజుల్లో ఇద్దరు డాన్లు చనిపోయారు. కరుడుగట్టిన ఈ ఇద్దరు క్రిమినల్స్ ను జైల్లో ఉండి హాయిగా బతికేస్తున్నారు.. పదుల సంఖ్యలో హత్యలు చేయటమే కాకుండా.. అండర్ వరల్డ్ డాన్స్ గా చలామణి అయ్యారు..

ఇందులో ఒకరు చోటారాజన్. ముంబై అండర్ వరల్డ్ మాఫియా సామ్రాజ్యాన్ని శాసించాడు. ఎంతో మందిని కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేశాడు. పోలీసులకు సవాల్ విసిరి.. సమాంతరంగా వ్యవస్థను నడిపాడు. ఎంతో మందిని చంపి.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారాడు. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ ను సవాల్ చేసి.. ముంబైని తన గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నించాడు.

ముంబై ప్రముఖ వ్యాపారి బీఆర్ శెట్టి హత్యాయత్నం కేసులో ముంబై కోర్టు ఎనిమిదేళ్ల ఏళ్ల జైలు శిక్ష విధించటంతో.. తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు చోటా రాజన్. కొన్నేళ్ల క్రితం ఇండోనేషియా దేశంలో ఇంటర్ పోల్ అధికారులకు చిక్కిన చోటారాజన్ ను.. ప్రత్యేక విమానంలో ఢిల్లీ తీసుకొచ్చారు. ఆ తర్వాత అతనిపై కేసులను విచారించిన కోర్టు.. బీఆర్ శెట్టి హత్యాయత్నం కేసులో శిక్ష విధించింది. తీహార్ జైలులో ఉన్న చోటారాజన్ కు కరోనా పాజిటివ్ అని నిర్థారణ కావటంతో.. చికిత్స నిమితం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు. చోటారాజన్ పై 70 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అండర్ వరల్డ్ డాన్ గా చోటారాజన్ చాలా ఫేమస్…

ఇదే విధంగా సరిగ్గా వారం క్రితం.. అంటే 2021 మే ఒకటో తేదీన బీహార్ గ్యాంగ్ స్టర్, అండర్ వరల్డ్ డాన్.. మాజీ ఎంపీ అయిన షాహబుద్దీన్ సైతం కరోనాతో చనిపోయాడు. షాహబుద్దీన్ సైతం తీహార్ జైలులోనే శిక్ష అనుభవిస్తున్నారు. కరోనా పాజిటివ్ రావటం.. ఇన్ ఫెక్షన్ రావటంతో ఢిల్లీలోని దీన్ దయాళ్ ఆస్పత్రికి తరలించారు జైలు అధికారులు. అక్కడ చికిత్స పొందుతూ షాహబుద్దీన్ చనిపోాడు.

బీహార్ రాష్ట్రం శివన్ జిల్లాకు చెందిన షాహబుద్దీన్ గ్యాంగ్ స్టర్ నుంచి ఎంపీగా గెలిచారు. 2004లో సతీష్ రోషన్, రిగీష్ రోషన్ అనే ఇద్దరిని డబ్బు కోసం అతి కిరాతకంగా హత్య చేశారు. ఆ కేసులో 2015లో కోర్టులో జీవిత ఖైదు విధించింది. సుప్రీంకోర్టు సైతం 2018లో శిక్షను ఖరారు చేయటంతో.. అప్పటి నుంచి తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు షాహబుద్దీన్. బీహార్ రాష్ట్రం శివన్ నియోజకవర్గం నుంచి రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ నుంచి నాలుగు సార్లు ఎంపీగా పోటీ చేసి గెలిచాడు షాహబుద్దీన్. బీహార్ బాహుబలి అనే పేరు ఉంది.

వారం రోజుల గ్యాప్ లో ఇద్దరు గ్యాంగ్ స్టర్స్, అండర్ వరల్డ్ డాన్స్ చనిపోవటం.. అది కూడా తీహార్ జైలులోనే శిక్ష అనుభవిస్తూ.. ఇద్దరూ కరోనాతో చనిపోవటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు