వాళ్లిద్దరూ కొట్టుకుంటుంటే.. మధ్యలో దూరిన మహేష్ ఫ్యాన్స్.. ట్విట్టర్ లో బిగ్ ట్విస్ట్

వాళ్లిద్దరూ కొట్టుకుంటుంటే.. మధ్యలో దూరిన మహేష్ ఫ్యాన్స్.. ట్విట్టర్ లో బిగ్ ట్విస్ట్

వాళ్లిద్దరూ కొట్టుకుంటుంటే.. మధ్యలో దూరిన మహేష్ ఫ్యాన్స్.. ట్విట్టర్ లో బిగ్ ట్విస్ట్

సండే రోజు మండిపోయారు హీరోల ఫ్యాన్స్. ఎన్టీఆర్ – అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ వార్ జరుగుతుంటే.. మధ్యలో దూరిపోయింది మహేష్ బాబు ఫ్యాన్స్. ఎంబీ ఫ్యాన్స్ ఎవరికీ మద్దతు ఇవ్వకుండా.. #UnitedTFI అనే హ్యాష్ ట్యాగ్ తో ముందుకు వచ్చింది.

హీరోలు ఎవరూ కొట్టుకోవద్దు.. నెగెటివ్ వద్దు.. బీ పాజిటివ్ అంటూ సరికొత్తగా వచ్చింది. ఈ హ్యాష్ ట్యాగ్ మహేష్ బాబు ఫ్యాన్స్ క్రియేట్ చేయకపోయినా.. వాళ్లు మద్దతిస్తున్నారు. బీ కూల్.. బీ కూల్ అంటూ కొత్తగా ట్యాగ్ చేస్తున్నారు.

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కటిగా ఉందాం అంటూ న్యూట్రల్ నెటిజన్లు, సినీ అభిమానులు దీనికి మద్దతు ఇస్తున్నారు. దీని వెనక మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారంటూ అల్లు అర్జున్ – ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇద్దరూ ఒక్కటిగా అనటం విశేషం.

అగ్గిలో ఆజ్యం పోయకపోయినా.. వివాదాన్ని కూల్ చేద్దామని మహేష్ బాబు ఫ్యాన్స్ చూస్తుండటం విశేషం. యునైటెడ్ టీఎఫ్ఐ హ్యాష్ ట్యాగ్ కు సినీ ఇండస్ట్రీలోని కొంత మంది ఆర్టిస్టులు మద్దతు ప్రకటించారు.

ఏ హీరో ఫ్యాన్స్ ను తగ్గమని చెప్పే దమ్ము ఎవరికీ లేదు కాబట్టి.. ఈ రకంగా ఐకమత్యం రాగం ఎత్తుకున్నారు ఆర్టిస్టులు. తద్వారా ఆవేశంలో ఉన్న డైహార్డ్ ఫ్యాన్స్ మనస్సు కరుగుతుందని.. కూల్ అవుతారని.. ఇష్యూ ముగుస్తుందని వీరి ఆలోచన.

అసలే లాక్ డౌన్ ఎత్తిపడేశారు.. బార్లు, పబ్స్ ఓపెన్ అయిన రోజు మొదలైంది.. కిక్కో కిక్కు అన్నట్లు ఉన్న కుర్రోళ్లకు సండే రోజు మరింత కిక్కు ఎక్కే ఇష్యూ దొరికితే ఊరుకుంటారా ఏంటీ.. అబ్బే అస్సలు తగ్గటం లేదు. ఏదో మధ్యలో #UnitedTFI అనే హ్యాష్ ట్యాగ్ అలా మెరుపులా కనిపించి వెళ్లిపోతుంది. ఆ బిగ్ హీరో ఫ్యాన్స్ హ్యాష్ ట్యాగ్సే ట్రెండ్ అవుతున్నాయి..

#UnitedTFI
#CharacterlessPigNTR
#InsecureFoxAlluArjun

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు