ఏపీ, తెలంగాణలో ఆల్ మోస్ట్ అన్ లాక్.. మరిన్ని సడలింపులతో హోటల్ రంగానికి ఊపు

ఏపీ, తెలంగాణలో ఆల్ మోస్ట్ అన్ లాక్.. మరిన్ని సడలింపులతో హోటల్ రంగానికి ఊపు

ఏపీ, తెలంగాణలో ఆల్ మోస్ట్ అన్ లాక్.. మరిన్ని సడలింపులతో హోటల్ రంగానికి ఊపు

దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. 2021, జూన్ 15వ తేదీ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 70 వేల పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. పాజిటివ్ రేటు 3 శాతానికి పడిపోయింది. కోలుకుంటున్న వారి సంఖ్య ఇందుకు రెట్టింపు ఉంది. 70 వేల మంది కరోనా బారిన పడితే.. లక్షా 17వేల మంది రికవరీ అయ్యారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్, వెంటిలేటర్లు, మందుల ఇబ్బందులు తగ్గాయి.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గుతుండటంతో.. అన్ లాక్ దిశగా అడుగులు వేస్తున్నాయి ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం రాత్రి పూట కర్ఫ్యూ మాత్రమే విధించాలని నిర్ణయించింది. రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ విధించాలని భావిస్తుంది. 17వ తేదీన జరిగే సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇక అంతర్ రాష్ట్ర రవాణాపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని కూడా భావిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. 20వ తేదీ నుంచి పాస్ లేకుండా ఏపీ – తెలంగాణ మధ్య రాకపోకలు సాగనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కొత్త కేసుల సంఖ్య మూడు వేలుగా నమోదు అవుతుంది. ప్రస్తుతం 2 గంటల వరకు ఉన్న ఆంక్షల సడలింపును.. జూన్ 20వ తేదీ నుంచి సాయంత్రం 6 గంటల వరకు చేయాలని భావిస్తుంది ప్రభుత్వం. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించాలని.. జూన్ 20వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలని భావిస్తుంది. వర్షాలు పడటంతో..వ్యవసాయ పనులు ఊపందుకోనున్నాయి. ఈ క్రమంలోనే వ్యాపార లావాదేవీల సమయాన్ని పెంచాలని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం.

ముఖ్యంగా హైదరాబాద్ లో ఆంక్షల సడలింపు సమయాన్ని పెంచటం ద్వారా.. రాత్రి 9 గంటల వరకు వ్యాపారాలకు అవకాశం కల్పించటం ద్వారా హోటల్, రెస్టారెంట్లు, బార్లకు అనుమతి ఇవ్వాలని భావిస్తున్నారు. తద్వారా ఉపాధి అవకాశాలను పెంచాలని భావిస్తుంది. మూడు నెలలుగా హోటల్, రెస్టారెంట్ల రంగం దివాళా తీసింది. లక్షల మంది ఉపాధి కోల్పోయారు. ఈ క్రమంలోనే హోటల్ రంగానికి మరిన్ని మినహాయింపులు ఇవ్వటం ద్వారా.. ఉపాధిని పెంచాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు