అప్పట్లో ఇందిర.. ఇప్పుడు యోగీ.. ఇద్దరు పిల్లలనే కనండి.. రాయితీలు పొందండి..

అప్పట్లో ఇందిర.. ఇప్పుడు యోగీ.. ఇద్దరు పిల్లలనే కనండి.. రాయితీలు పొందండి..

అప్పట్లో ఇందిర.. ఇప్పుడు యోగీ.. ఇద్దరు పిల్లలనే కనండి.. రాయితీలు పొందండి..

ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ సరికొత్త పాలసీ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా మొదటిసారి ఓ రాష్ట్రం.. జనాభా పెరుగుదలపై నియంత్రణ విధిస్తూ సరికొత్త విదానాన్ని తీసుకొస్తుంది. దీనికి సంబంధించి పాలసీ డ్రాఫ్ట్ అంతా సిద్ధం చేసిన సీఎం యోగీ.. దాన్ని అసెంబ్లీలో పెట్టి ఆమోద ముద్ర వేయించటానికి సిద్ధం అయ్యారు. దీని వల్ల జనాభా పెరుగుదలను కంట్రోల్ చేయొచ్చని చెబుతున్నారు.

ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ జనాభా 20 కోట్లు. కొత్తగా లెక్కలు తీస్తే మరో రెండు కోట్ల వరకు పెరిగే అవకాశం ఉంది. జనాభా సంఖ్యను తగ్గించటానికి జనాభా నియంత్రణ పాలసీను రాష్ట్ర స్థాయిలో తీసుకొస్తున్న మొదటి ముఖ్యమంత్రిగా యోగీ ఆదిత్యనాథ్ చరిత్ర సృష్టించబోతున్నారు. గతంలో ఇందిరాగాంధీ ఇదే రకమైన పాలసీని తీసుకొచ్చింది. బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించింది.

> మేం ఇద్దరం.. మాకు ఇద్దరు అనే నినాదంతో దీన్ని అమలు చేయబోతున్నారు.
> ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే ప్రభుత్వ పథకాలు కట్ చేయాలనే విధానం కొత్త పాలసీలో ఉంది.
> మూడో బిడ్డను కంటే రేషన్ కార్డు నుంచి అందే సబ్సిడీ ఎత్తివేస్తారు
> ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హుడిగా గుర్తిస్తారు
> స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయటానికి అనర్హత కింద లెక్కిస్తారు
> ఒకే పిల్లోడు ఉంటే పీఎఫ్ లో 3 శాతం అదనంగా చెల్లింపు చేస్తారు
> ఒక్క పిల్లోడినే కంటే.. 20 సంవత్సరాలు వచ్చే వరకు ఉచిత వైద్యం అందిస్తారు
> ఇద్దరు పిల్లలు మాత్రమే కన్నట్లయితే ఇంటి పన్ను, కరెంట్ బిల్లు, హోం లోన్ లో రాయితీ ఇవ్వబోతుంది.

ప్రస్తుతం స్టేట్ లా కమిషన్ దగ్గర తయారైన ఇద్దరు పిల్లల పాలసీపై జూలై 19వ తేదీ వరకు అభిప్రాయ సేకరణ జరుగుతుంది. కొందరు అయితే ఇన్ కం ట్యాక్స్ రాయితీ డిమాండ్ చేస్తున్నారు. దీన్ని కూడా పరిశీలిస్తామని చెబుతోంది యూపీ రాష్ట్ర ప్రభుత్వం.

యూపీలో జనాభా పెరుగుదల నియంత్రణ కోసం ఇంత పెద్ద ఎత్తున స్కీం తీసుకురావటం యోగీ ఆదిత్యనాథ్ కే చెల్లింది. ఇదో రికార్డ్ అంటున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు