పాతబస్తీలోనే.. MIM అధినేత అసదుద్దీన్ పై తిరగబడ్డ జనం

పాతబస్తీలోనే ఇలాంటి పరిస్థితి ఎదురు అవుతుంది అంటే.. ఓట్లలో ఈ ప్రభావం బాగా

హైదరాబాద్ ఓల్డ్ సిటీ అంటే ఠక్కున గుర్తుకొచ్చే పార్టీ ఎంఐఎం. అలాంటి పార్టీపైనే తిరగబడ్డారు జనం. వరదల్లో సర్వస్వం కోల్పోయాం.. నెల రోజులుగా నీళ్లల్లో ఉన్నాం.. ఇప్పుడు తీరిగ్గా వచ్చారు.. ఎన్నికలు వచ్చేసిరికి ఓట్ల కోసం వచ్చారు.. ఆదుకోవటానికి రాలేదు.. మీకు జనం ఓట్లు కావాలి.. జనం సమస్యలు పట్టవా అంటూ నిలదీవారు. ఎంఐఎం అభ్యర్థినే నిలదీస్తూ తిరగడటంతో అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోయారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ.

హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని జాంబాగ్ డివిజన్ లో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికీ తిరిగారు. ఈ సమయంలో ఆయనపై ప్రజలు తిరగబడ్డారు. వరద సాయం 10 వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని.. కొందరికే ఇచ్చారని.. నిజమైన బాధితులకు అందలేదని ప్రశ్నించారు.

వరద బాధితులు తిరగడటంతో.. వారిని సముదాయించి అక్కడి నుంచి వెళ్లిపోయారు ఎంఐఎం అదినేత అసదుద్దీన్. ప్రజల ఆగ్రహం ఏ విధంగా ఉందో ప్రత్యక్షంగా చూసిన ఆయనకు.. ఎంఐఎం పార్టీకి పాతబస్తీలోనే ఇలాంటి పరిస్థితి ఎదురు అవుతుంది అంటే.. ఓట్లలో ఈ ప్రభావం బాగా కనిపించవచ్చు.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు