పనికిరాని ఒప్పందాలు పక్కన పెట్టి – భారత్ కు సాయం చేయండి – బైడెన్ ఆదేశం : ఇండియాకు భారీగా ఆక్సిజన్

usa send oxygen cyclinders to india

భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి.. ఆక్సిజన్ కొరతపై స్పందించిన అమెరికా.. అవసరం అయిన సాయం చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలోనే భారత్ తో ఉన్న రక్షణ, వైద్య ఒప్పందాలను సైతం పక్కన పెట్టిన అధ్యక్షుడు బైడెన్.. భారత్ కు కావాల్సిన వైద్య పరికరాలను యుద్ధ ప్రాతిపదికన పంపించాలని ఆదేశించారు.

అమెరికా అధ్యక్షుడు ఆదేశంతో వెంటనే అలర్ట్ అయిన భారత్.. అమెరికాలోని కాలిఫోర్నియా విమానాశ్రయంలో ప్రత్యేక విమానాన్ని సిద్ధం చేసింది. ఇందులో.. అమెరికా అందించిన 318 ఆక్సిజన్ ట్యాంకులను లోడ్ చేయిస్తున్నారు. ఆక్సిజన్ సరఫరాలో తలెత్తుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు.. ప్రతి ఆస్పత్రిలో చిన్న సైజ్ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయటానికి అవసరం అయిన.. ట్యాంకులు ఇవి. అమెరికా నుంచి వస్తున్న ఆక్సిజన్ ట్యాంకు పరికరాల వల్ల.. 318 ఆస్పత్రుల్లో 48 గంటల్లోనే ఏర్పాటు చేయటానికి అవకాశం ఉంటుంది.

కరోనా రోగుల ప్రాణాలను కాపాడటానికి ఆక్సిజన్ అనేది ప్రస్తుతం చాలా డిమాండ్ ఉంది. మే నెల రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉండటంతో.. యుద్ధ ప్రాతిపదికన ఆక్సిజన్ ప్లాంట్లు అవసరం అవుతున్నాయి. ఇండియాలో అన్ని ప్లాంట్ల ఏర్పాటుకు అవసరం అయిన వైద్య పరికరాల కొరత ఉంది. దీన్ని గుర్తించిన అమెరికా.. 318 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు కావాల్సిన ట్యాంకులు, పరికరాలను అత్యవసరంగా అందిస్తుంది.

అమెరికా అధ్యక్షుడు బైడెన్ అలా చెప్పారో లేదో.. ఆ పరిశ్రమల నుంచి సరుకు ఎయిర్ పోర్టుకు రావటం.. అప్పటికే అక్కడ ఎయిర్ ఇండియా విమానం సిద్ధంగా ఉండటం.. చకచకా లోడింగ్ చేయటం జరిగిపోతున్నాయి. మరో 24 గంటల్లో ఎయిర్ ఇండియా విమానం.. ఢిల్లీలో ల్యాండ్ కానుంది.

ఢిల్లీ నుంచి దేశవ్యప్తంగా అత్యవసరంగా ఉన్న ఆయా రాష్ట్రాల్లోని ఆస్పత్రులకు ఈ సామాగ్రి పంపిణీ ఎయిర్ కార్గో ద్వారానే జరగనుంది. మరో 72 గంటల్లో.. అంటే మూడు రోజుల్లో ఆక్సిజన్ కొరత 20 తీరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కేసులు పెరిగి ఆక్సిజన్ కొరత తీరకపోయినా.. అత్యవసరం సమయానికి ఆక్సిజన్ అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు