టీఆర్ఎస్ పార్టీ ఓడినందుకు.. కాంగ్రెస్ ఆయన రాజీనామా చేయటం ఏంటీ

టీఆర్ఎస్ పార్టీ ఓడినందుకు.. కాంగ్రెస్ ఆయన రాజీనామా చేయటం ఏంటీ.. పీసీసీ అధ్యక్షుడిగా పార్టీ ఓడిపోతున్నా.. జీరోకు వచ్చిందని అందరూ నెత్తీనోరు బాదుకుంటున్నా రాజీనామా చేయలేదు.. అలాంటిది సరిగ్గా ఈ టైంలో...

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు తర్వాత.. టీఆర్ఎస్ పార్టీ ఓటమితో అందరి కంటే ఎక్కువ బాధపడింది ఎవరో తెలుసా.. టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆరో.. కేటీఆరో.. మరొకరో కాదు.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎస్.. అవును ఇది నిజం.. ఎందుకంటే జీహెచ్ఎంసీ ఫలితాలు చూసిన తర్వాత నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేశారు. కాకపోతే ఇక్కడే ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పులో కాలేశారు.. విమర్శలు, ఆరోపణలకు కారణం అయ్యారు.

కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చిత్తుగా ఓడిపోలేదు.. 2018 ఎన్నికల్లోనే చిత్తు చిత్తుగా ఓడిపోయింది.
ఆ తర్వాత హుజూర్ నగర్ ఎన్నికలోనూ ఓడిపోయింది ఆ తర్వాత దుబ్బాక ఎన్నికల్లోనూ ఓడిపోయింది.

రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిపోయారు.. పార్టీ భూస్థాపితం అయ్యింది అన్న విమర్శలు వచ్చినా లెక్క చేయలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
సొంత పార్టీ కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచినా.. పీసీసీ అధ్యక్షుడిగా పార్టీ ఓడిపోతున్నా.. జీరోకు వచ్చిందని అందరూ నెత్తీనోరు బాదుకుంటున్నా రాజీనామా చేయలేదు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ ఇద్దరు కార్పొరేటర్లు మాత్రమే గెలవగానే వెంటనే రాజీనామా చేశారు. మరి అన్ని ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు చేయని రాజీనామా ఇప్పుడు ఎందుకు చేశారు అంటే.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కదా అంటున్నారు నెటిజన్లు.

అమ్మతోడుగా ఇదే డిస్కషన్ నడుస్తుంది.. ఇది మా సొంత అభిప్రాయం కాదు.. సోషల్ మీడియాలో వస్తున్న నెటిజన్లు కామెంట్లతోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా తర్వాత ప్రజల నుంచి వస్తున్న మాటలనే ఇక్కడ ప్రస్తావించాం. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ ఈ స్థాయికి దిగజారిపోవటానికి లీడర్ తప్పిదాలు లేవంటారా…

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు