హైదరాబాద్ లో హనుమంతరావుపైనే కాంగ్రెస్ ఆశలు

హైదరాబాద్ లో హనుమంతరావుపైనే కాంగ్రెస్ ఆశలు

కాంగ్రెస్ పార్టీలో కురువృద్దుడు ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు వి. హనుమంతరావు. సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడు మీడియాలో ఉంటారు వీహెచ్.. కాగా ప్రస్తుతం హనుమంతరావు పార్టీలో కీ రోల్ పోషించనున్నారు అనే వార్తలు వస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల బాధ్యత హనుమంతరావుకు ఇచ్చేందుకు కాంగ్రెస్ నేతలు సన్నాహాలు చేస్తున్నారట. దుబ్బాక ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ పెద్దలు ఆలోచనలో పడ్డారు. ఆ ఓటమి చేదు జ్ఞాపకాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. ఇక ఈ తరుణంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేలా కనిపిస్తుంది.

అయితే నగరంలో పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్నప్పటికీ నాయకత్వ లేమి స్పష్టంగా కనిపిస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్న పార్టీకి పెద్దగా ఒరిగింది ఏమి లేదని పార్టీ పెద్దలే చెబుతున్న మాట.. ఇక సొంతపార్టీ నేతల మద్యే వైరం.. ఎన్నో ఆశలతో కాంగ్రెస్ లో చేరిన రేవంత్ ను అసలు మరిచిపోయారు. దింతో అస్తవ్యస్తమైన కాంగ్రెస్ ను దారిలో పెట్టి గ్రేటర్ ఎన్నికల్లో ముందుండి నడిపించే బాధ్యతను వీ హనుమంతరావుపై పెట్టనుంది అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గ్రేటర్ పరిధిలో అత్యంత అనుభవం ఉన్న హనుమంతరావు చేతికి బాధ్యలు ఇస్తే కొద్దోగొప్పో సీట్లు గెలవచ్చు అనేది కాంగ్రెస్ లో సాగుతున్న చర్చ..

ఇక సీనియారిటీ పరంగా చూసినా హనుమంతరావే ముందున్నారు. అయన కంటే సీనియర్ లీడర్ తెలంగాణలో ఎవరు కనపడటం లేదు. సోనియా కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉండే తెలంగాణకు చెందిన నాయకుల్లో హనుమంతరావు ఒకరు. అధిష్టానం దృష్టిలో కూడా పేరు ఉండటంతో హనుమంతరావుకె ఈ సారి గ్రేటర్ బాధ్యతను అప్పగించనున్నట్లు టాక్.. అయితే ఈ బాధ్యతను స్వీకరించేందుకు వీహెచ్ సిద్ధంగా ఉన్నారా లేదా అనేది ఆయన చెప్పే వరకు తెలియదు..

అయితే గత కొంత కాలంగా రాష్ట్ర పార్టీ నాయకులపై హనుమంతరావు గుర్రుగా ఉంటున్నారు. తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని మీదకి ముందు వచ్చి చెబుతున్నారు. రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలకు కూడా దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ లో తగిన ప్రాధాన్యత ఇచ్చి ఎన్నికల బాధ్యతను అప్పచెప్పేందుకు కాంగ్రెస్ లోని ఓ వర్గం ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. వీహెచ్ కు ఇంత పెద్ద బాధ్యత ఇస్తే నెట్టుకొస్తారా లేదా అనేది వాదన కూడా వినిపిస్తుంది పార్టీ వర్గాల్లో. ఏది ఏమైనా మరికొద్ది రోజులు వేచిచూస్తే కాంగ్రెస్ విధానాలు తెలియనున్నాయి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు