షర్మిల సంకల్ప సభకు విజయమ్మ, భారతి

షర్మిల సంకల్ప సభకు విజయమ్మ, భారతి

వైఎస్ షర్మిల రాజకీయ ప్రవేశం గ్రాండ్ గా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని సన్నాహాలు పూర్తి చేసింది. పార్టీ ప్రకటన, జెండా ఆవిష్కరణ, ఎజెండా ప్రకటన కోసం ఖమ్మంలో భారీగా బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది షర్మిల. అందులో భాగంగా సన్నాహక ఏర్పాట్లు చేసింది.

ఏప్రిల్ 9వ తేదీన ఖమ్మంలోని షర్మిల పార్టీ ఆవిష్కరణ సభకు విజయమ్మతోపాటు భారతి హాజరవుతున్నారు. షర్మిల పార్టీ ప్రకటన సభకు విజయమ్మ హాజరవుతారా లేదా అనే సందేహాలకు ఫుల్ స్టాప్ పెడుతూ.. తల్లి వస్తున్నారు అంటూ తెలిపింది షర్మిల. పార్టీ ప్రకటనను స్వయంగా షర్మిల ప్రకటిస్తే.. జెండాను మాత్రం విజయమ్మ ఆవిష్కరించనున్నారు.

ఇక మరో అతిథిగా భారతి అంటే సీఎం జగన్ భార్య, షర్మిల వదిన కాదు.. విజయమ్మ సోదరి, షర్మిల పిన్ని.. వైవీ సుబ్బారెడ్డి సతీమణి భారతి. ఏప్రిల్ 9వ తేదీనే.. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పాదయాత్రను చేవెళ్ల నుంచి ప్రారంభించారు. అదే రోజును.. తెలంగాణలో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించటానికి ఎంచుకున్నారు షర్మిల.

షర్మిల రాజకీయ సభా వేదిక భారీగా ఉండనుంది. వంద మంది సభ్యులు కూర్చునే విధంగా వేదిక సిద్ధం అవుతుంది. లక్ష మంది సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని ప్రతి మండలం నుంచి 5 వేల మందితో జన సమీకరణ జరగాలని టార్గెట్ పెట్టుకుంది వైఎస్ షర్మిల ఏప్రిల్ 9న ఖమ్మంలో జరిగే షర్మిల బహిరంగ సభ కోసం ఖమ్మం పట్టణం ముస్తాబైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగు గుర్తులతో ముంచెత్తారు..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు