విజ్ఞులైన మన తెలంగాణ ప్రజలు ఇది గమనించాలి: విజయశాంతి

విజ్ఞులైన మన తెలంగాణ ప్రజలు ఇది గమనించాలి: విజయశాంతి

దుబ్బాక ఉపఎన్నికల వేల, కాంగ్రెస్ నాయకురాలు రాములమ్మ (విజయశాంతి) టీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ను నిజం నవాబుతో పోల్చారు విజయశాంతి. ‘నిజాం నవాబులు తమ విధేయులైన దొరల దన్ను, ఆర్థిక, భూ బలాలు, కిరాయి బలగాలతో ఏ విధమైన అధికారం చెలాయించారో తరతరాల తెలంగాణ చరిత్ర చెబుతుంది’ అని ఆమె అన్నారు.

‘అదే ధోరణిలో నేటి నయా టీఆర్‌ఎస్ దొరలు ప్రజాస్వామ్యాన్ని తమ అహంకారపు అదుపాజ్ఞలలోని యంత్రాంగంగా వ్యవస్థీకృత చెల్లుబాటు చేసి… తెలంగాణ బిడ్డలపై నడిపించే ప్రక్రియ జరుగుతున్నదనేది వాస్తవం. విజ్ఞులైన మన తెలంగాణ ప్రజలు ఇది గమనించి దుబ్బాక ఎన్నికలో టీఆర్ఎస్‌కు సరైన బుద్ధి చెబుతారని విశ్వసిస్తున్నాను’ అని విజయశాంతి అన్నారు.

ఇక సోమవారం కూడా ఓ ట్వీట్ చేశారు రాములమ్మ తాను సీఎం పదవికి రాజీనామా చేసి, కేటీఆర్‌ను సిఎం గద్దెపై కూర్చోబెట్టబోతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఎంతైనా నమ్మినవారిని గొంతు కోయడంలో కెసిఆర్ గారు అనుసరించే స్టైలే వేరు. అని అన్నారు

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు