విజయశాంతికి రాజ్యసభ ఎంపీ లేదా డిప్యూటీ సీఎం పదవి

మళ్లీ మళ్లీ పార్టీలు మారటం ఇష్టం లేదు అని.. బతికి ఉన్నన్నాళ్లు బీజేపీలోనే ఉంటాను.. గౌరవమైన పదవి కావాలని

లేడీ అమితాబ్ విజయశాంతి బీజేపీలో చేరారు. ఢిల్లీలోని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కుండువ కప్పుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ తరపున ఆమె సేవలను ఉపయోగించుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీలో మంచి గుర్తింపు ఉన్నా.. నాయకత్వం లోపం.. ఆమెను ఉపయోగించుకునే తీరుపై అసంతృప్తితో ఉన్న విజయశాంతి.. సొంత గూటికి బీజేపీలోకి మళ్లీ వచ్చేశారు.

విజయశాంతి పార్టీ మారుతున్నట్లు వార్తలు వచ్చిన వెంటనే తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఠాగూర్ ఆమెతో భేటీ అయ్యి చర్చించారు. అయినా ఆమె మాట వినలేదు.

అంతకు మించి బీజేపీ నుంచి మంచి ఆఫర్ వచ్చినట్లు సమాచారం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎం హోదాతో కేబినెట్ మంత్రి పదవి ఇస్తాం అని హామీ ఇచ్చారంట. అంతే కాదు.. అది సాధ్యం కాకపోతే రాజ్యసభ ఎంపీగా పంపిస్తాం అని.. మంచి గుర్తింపుతోనే సేవలు ఉపయోగించుకుంటాం అని బీజేపీ అగ్రనేతలు స్పష్టమైన హామీ ఇచ్చారంట.

మొదట బీజేపీ.. ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు.. టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారు. వైఎస్ బతికి ఉంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేవారు అనే టాక్ నడిచింది. కొన్నాళ్లు సైలెంట్ గా ఉండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు బీజేపీలోకి వచ్చారు. ఈ టైంలోనూ.. ఈ వయస్సులోనూ మళ్లీ మళ్లీ పార్టీలు మారటం ఇష్టం లేదు అని.. బతికి ఉన్నన్నాళ్లు బీజేపీలోనే ఉంటాను.. గౌరవమైన పదవి కావాలని కోరారంట.

ఆమె డిమాండ్లను పరిశీలించిన బీజేపీ హైకమాండ్.. రాజ్యసభ ఎంపీ ఇస్తామని చెప్పిందంట.. రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండాలి అనుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే డిప్యూటీ సీఎం హోదా ఇస్తామని స్పష్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు