కేశినేని నాని బీజేపీలోకి – బెజవాడలో ఉన్నా దూరం అందుకేనా

మిగతా ఇద్దరు ఎంపీలకు ఇస్తున్న ప్రాధాన్యత తనకు ఇవ్వటం లేదని

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యవహారం టీడీపీ నేతలతోపాటు అధినేత చంద్రబాబుకు కూడా అంతుచిక్కటం లేదు. దీనికి కారణం లేకపోలేదు. విజయవాడలోనే ఉంటూ పార్టీ హైకమాండ్ తో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారంట. చాలా రోజుల తర్వాత చంద్రబాబు విజయవాడ వస్తే.. ఉన్న ఒక్క ఎంపీ కూడా అటెండ్ కాలేదంట.. దీంతో ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికితోడు ఇటీవల భారీగా వేసిన పార్టీ కమిటీల్లో కేశినేని నానికి చోటు దక్కకపోవటం అనుమానాలకు బలాన్ని ఇస్తున్నాయి.

కేశినేని నాని బెజవాడ నుంచి రెండు సార్లు టీడీపీ ఎంపీగా గెలిచారు. గత ఎన్నికల్లో ఏపీలోలో గెలిచిన ముగ్గురు టీడీపీ ఎంపీల్లో నాని ఒకరు. కృష్ణా జిల్లాలోని సొంత పార్టీ నాయకులతో కేశినేని నానీకి పడటం లేదు. ఇప్పుడు కాదు ఇది.. మొదటి నుంచీ ఇదే వరస. కేశినేనికి ఎవరితోనూ పడదని అంటారు. దేవినేని ఉమాతో విబేధాలు, రవాణా కమిషనర్ తో వాగ్వాదం, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతో ట్విట్టర్ వార్.. పక్క జిల్లాలో గుంటూరు టీడీపీ ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్ తోనూ పెద్దగా మాటలు లేవంట. ఇలా ప్రతి ఒక్కరితోనూ విబేధాలు ఉన్నాయి. దీంతో ఎవరూ ఆయన్ను కలుపుకునిపోవటం లేదు.

ఎవరితోనూ సఖ్యతగా లేకపోవటంతో.. ఆయన ఇప్పుడు పార్టీ మారాలనే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే.. ఇటీవల ప్రకటించిన పార్టీ కమిటీల్లో గల్లా జయదేవ్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వగా.. కేశినేని నానిని అస్సలు దేకలేదు పార్టీ. కమిటీలు చూస్తేనే తెలుస్తుంది కదా అంటున్నారు నేతలు, కార్యకర్తలు. దీన్ని కేశినేని జీర్ణించుకోలేకపోతున్నారంట.

సిట్టింగ్ ఎంపీగా కేశినేని నాని ఉన్న బెజవాడ పార్లమెంటుకు టీడీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి నెట్టెం రఘురాంను నియమించటమే కాదు.. కృష్ణా జిల్లా నుంచి టీడీపీ పొలిట్ బ్యూరో లోకి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, వర్ల రామయ్య, బొండా ఉమాను తీసుకున్నారు. కనీసం ఈ మాట కూడా నానికి చెప్పలేదంట

కొందరికి పార్టీ కమిటీల్లో రెండేసి పదవులు ఇచ్చారు.. మిగతా ఇద్దరు ఎంపీలకు ఇస్తున్న ప్రాధాన్యత తనకు ఇవ్వటం లేదని కేశినేని నాని గుర్రుగా ఉన్నారంట.. మనం అనటం ఏంటీ.. ఆయన తెలియదా ఏంటీ అంటున్నారు ఆయన అనుచరులు, నేతలు.

సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ పార్టీ జంప్ అయినప్పుడే కేశినేని కూడా వెళతారని టాక్ వచ్చినా.. ఆయన వెళ్లలేదు. ఇప్పుడు మాత్రం కన్ఫామ్ అంటున్నారు. త్వరలోనే సోము వీర్రాజుతో భేటీ ఖాయం అంటున్నారు. చంద్రబాబుపై బరస్ట్ అవ్వటం కన్ఫామ్ అంటున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు