మంత్రి హరీశ్ రావు ఎక్కడ : ప్రాణ స్నేహితుడి ఇష్యూపై మౌనం ఎందుకు.. మంత్రుల మీటింగ్ కు డుమ్మా..

were is harish rao over etela issue

ఈటెల రాజేందర్ భూ కబ్జా ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత.. ప్రభుత్వం కమిటీలు వేయటం.. విచారణ చేయటం.. ఈటెలను మంత్రి పదవి నుంచి తొలగించటం వంటికి చకచకా జరిగిపోయాయి. మూడు రోజుల్లో ఇష్యూ మొత్తం తేలిపోయింది. ఈటల 20 ఏళ్లు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు.. సీఎం కేసీఆర్ తోపాటు మంత్రి హరీశ్ రావుకు ఎంతో ఆప్తులు.. ప్రాణ మిత్రుడు కూడానూ.. అయినా ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడలేదు హరీశ్ రావు.

ఈటెల రాజేందర్ భూ కబ్జా వెలుగులోకి వచ్చిన సమయంలో కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో ఉన్న హరీశ్ రావు.. ఈ అంశంపై మీడియా ప్రశ్నించినా సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. అసలు ఈటెల రాజేందర్ భూ కబ్జా అంశంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ అంశం తనకు సంబంధించినది కాదన్నట్లు.. అంటీ ముట్టనట్లు ఉంటున్నారు.

ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్, అసైన్డ్ భూముల వ్యవహారంతోపాటు ప్రభుత్వంలోని మంత్రులపైనా కొన్ని ఆరోపణలు, విమర్శలు చేశారు. ఈటెలకు కౌంటర్ గా.. మంత్రులు ప్రెస్ మీట్ పెట్టారు.. అందులో మంత్రి హరీశ్ రావు పాల్గొనలేదు. పార్టీపై, సీఎం కేసీఆర్ ఫ్యామిలీపై ఈటెల విమర్శలు చేసినా.. టీఆర్ఎస్ పార్టీని ఛాలెంజ్ చేస్తున్నా.. మంత్రి హోదాలో.. సీఎం కేసీఆర్ ఫ్యామిలీ సభ్యుడిగా హరీశ్ రావు ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం ఇప్పుడు అందర్నీ ఆలోచింపజేస్తోంది.

టీఆర్ఎస్ పార్టీ నిర్మాణంలో కీలక వ్యక్తుల్లో హరీశ్, ఈటెల ఉన్నారు. మెదక్ జిల్లాను హరీశ్ చూసుకుంటే కరీంనగర్ జిల్లాను ఈటెల చూసుకునే వారు. ఉత్తర తెలంగాణలో హరీశ్ – ఈటెల సమన్వయంగా ముందుకు నడిపించారనే టాక్ ఉంది. ఇద్దరి మధ్య విభేదాలు ఏమీ లేవు.. ఇద్దరూ పార్టీ పదవుల్లో కానీ.. ప్రభుత్వంలో కానీ కేబినెట్ హోదాలోనే కొనసాగారు. మంచి పోర్టుపోలియోల్లోనే ఉన్నారు.

ఈటెల రాజేందర్ తో మంత్రి హరీశ్ రావుకు 20 ఏళ్ల అనుబంధం ఉంది.. అలాంటిది ఈటెలపై ఇంత జరుగుతున్నా.. ఈటెల ఇన్నేసి మాటలు అంటున్నారు ఒక్క మాట సైతం మాట్లాడటం లేదు హరీశ్ రావు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు