Whale vomit : హైదరాబాద్ లో తిమింగలం వాంతి పేర మోసం.. ఏడుగురు అరెస్ట్

Whale vomit : ఈ మధ్య తిమింగలం వాంతి పేర వార్తలు చక్కర్లు కొట్టాయి. దీని ధర కోట్లలో ఉంటుందని, దీనిని సుగంధ ద్రవ్యాల్లో వాడతారని గత కొద్దీ రోజులుగా వార్తలు వచ్చాయి. అయితే దాని విలువ తెలుసుకున్న కొందరు వ్యక్తులు కృత్రిమంగా తిమింగలం వాంతిని తయారు చేసి అమ్ముతున్నారు.

అంతే కాదు మాయమాటలు చెప్పి రంగురాళ్లు, ఇత్తడి ప్లేట్లను అమాయకపు ప్రజలకు అమ్ముతూ వారినుంచి లక్షల్లో డబ్బు దోచుకుంటున్నారు. ఇందుకోసం ఏడుగురు సభ్యులు గల ఓ టీం ఖైరతాబాద్ లోని ఎస్‌బీఐ వీధిలో ఓ గది కార్యాలయం ఓపెన్ చేసింది.

వ్యాపారం సాఫీగా సాగుతున్న సమయంలో కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఆయా వ్యాపారాలు చేస్తున్నారు. అందరు కలిసి ఈ వ్యాపారం మొదలు పెట్టారు. కాగా.. వీరి పేర్లను పోలీసులు వెల్లడించారు.

షకీర్‌ అలీ(38), షేక్‌ అలీ(60), మహమ్మద్‌ ఆరిఫ్‌(60), మహమ్మద్‌ నజీర్‌, మోహన్‌లాల్‌ యాదవ్‌(57), మహమ్మద్‌ అజారుద్దీన్‌(33), మహమ్మద్‌ హుస్సానుద్దీన్‌(51)లను అరెస్ట్ చేసిన పోలీసులు… వారి నుంచి నకిలీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు