జగన్ బెయిల్ రద్దు పిటీషన్ సరే.. ఎగ్గొట్టిన రూ.273 కోట్లపై విచారణకు రండీ : రఘురామకృష్ణంరాజుకు సీబీఐ షాక్

జగన్ బెయిల్ రద్దు పిటీషన్ సరే.. ఎగ్గొట్టిన రూ.273 కోట్లపై విచారణకు రండీ : రఘురామకృష్ణంరాజుకు సీబీఐ షాక్

ఆకాశంపై ఉమ్మేస్తే అది మనపైనే పడుతుంది.. పతివ్రత గురించి సన్నిలియోన్ చెబితే ఎలా ఉంటుందో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు సంగతి సైతం అలాగే ఉంది. ఏప్రిల్ 6వ తేదీ జరిగిన ఓ విచిత్రమైన ఘటన ఏపీ ప్రజలు అవాక్కయ్యేలా చేసింది. సీఎం జగన్ పై ఉన్న బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారని ఓ వర్గం మీడియా కోడైకూసింది.. పెద్ద హడావిడి చేసింది. అస

లు వాస్తవం తెలిసిన తర్వాత అందరూ అవాక్కవుతున్నారు. అమ్మ రఘురామకృష్ణంరాజు అంటున్నారు.

విషయం ఏంటంటే.. బ్యాంకులకు అక్షరాల 273 కోట్ల రూపాయల జనం సొమ్మును ఎగ్గొట్టారు ఎంపీ రఘురామకృష్ణంరాజు. దీనిపై చెన్నైలో సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఏ క్షణమైనా విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. సీబీఐ కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది. సరిగ్గా ఇలాంటి టైంలోనే.. ఎంపీగారు.. వ్యూహాత్మక ఎత్తుగడ వేశారు.

273 కోట్ల రూపాయలను బ్యాంక్ కు ఎగ్గొట్టిన కేసులో విచారణ తర్వాత అరెస్ట్ తప్పదనే సంకేతాలు వచ్చిన క్రమంలో.. కేసును డైవర్ట్ చేయటంతోపాటు.. జనం దృష్టికి మళ్లించటానికి సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటీషన్ దాఖలు చేసినట్లు చెప్పుకుంటున్నారు. జగన్ బెయిల్ రద్దు చేయాలి అనేది విచారణ చేస్తున్న సీబీఐ చేయాలి లేదంటే కోర్టులు స్వయంగా ఆదేశించాలి. అంతేకానీ.. ఒకరు బెయిల్ చేయమంటే రద్దు కాదు. అదే విధంగా విచారణ తుది దశలో ఉన్న కేసులో బెయిల్ ఎలా రద్దు చేస్తారనేది న్యాయవాది గోపాలరావు అంటున్నారు.

బ్యాంకులకు జనం సొమ్ము 273 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన రఘురామకృష్ణంరాజుపై సీబీఐ విచారణ వేగవంతం చేసింది. చెన్నై లేదా ఢిల్లీలో ఆయన విచారణకు హాజరుకావాల్సిన సమయం ఆసన్నమైందని.. ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సేకరించిన సీబీఐ.. అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని చెబుతోంది. గతంలో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం విషయంలోనూ విచారణ తర్వాత హడావిడిగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది. సేమ్ టూ సేమ్ అలాగే ఉంది ఈ కృష్ణంరాజుగారి కేసు అని.. అరెస్ట్ అయితే మైలేజ్ ఎక్కడ దెబ్బతింటుందో అనే ఉద్దేశంతో.. ఇలాంటి పిటీషన్ దాఖలు చేసి డైవర్ట్ చేయటానికి ప్రయత్నిస్తున్నారు అంటున్నారు కొందరు న్యాయవాదులు.

సీఎం జగన్ బెయిల్ రద్దు పిటీషన్ సరే సారూ.. ముందు బ్యాంకులకు ఎగ్గొట్టిన 273 కోట్ల రూపాయలను ఎలా చెల్లించాలి అనేది చూడండి.. ఎందుకంటే అది జనం సొమ్ము.

క్లిక్ చేసి చదవండి : ఎన్వీ రమణ చీఫ్ జస్టిస్ అయితే.. టీడీపీలో సంబురాలు ఏంటీ ?

క్లిక్ చేసి చదవండి : తెలుగు తమ్ముళ్లలో తెగింపు : ఆ ఛానెళ్లను, పత్రికలను నమ్ముకుంటే మునిగిపోతాం

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు