ప్రజాక్షేత్రంలో ఓడిపోయినా.. కోర్టులో గెలుస్తాం : ముందే చెప్పిన చంద్రబాబు

ప్రజాక్షేత్రంలో ఓడిపోయినా.. కోర్టులో గెలుస్తాం : ముందే చెప్పిన చంద్రబాబు

చంద్రబాబు చెప్పిందే జరిగింది.. ఎన్నికలు బహిష్కరించినా.. హైకోర్టులో గెలిచారు

ప్రజాక్షేత్రంలో ఓడిపోయినా.. కోర్టులో గెలుస్తాం : ముందే చెప్పిన చంద్రబాబు

జెడ్పీటీసీ, ఎంపిటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం అని టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఈ సమయంలో చంద్రబాబు చేసిన ఓ కామెంట్ ఇప్పుడు నిజం అయ్యింది. అప్పుడు ఎవరూ సీరియస్ గా తీసుకోకపోయినా.. జెడ్పీ ఎన్నికలపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు తర్వాత చంద్రబాబు చెప్పిందే జరిగింది అనే టాక్ హల్ చల్ చేస్తుంది.

జెడ్పీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం.. నా 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో చాలా బాధాకరమైన నిర్ణయం అంటూ చెప్పుకొచ్చారు. ఈ టైంలోనే.. ప్రజాక్షేత్రంలో పోటీ చేయకపోయినా.. ఎన్నికల సంఘంపై, జెడ్పీ ఎన్నికల షెడ్యూల్ పై న్యాయ పోరాటం చేస్తానని.. హైకోర్టు, సుప్రీంకోర్టు ద్వారా న్యాయం జరుగుతుంది అని చెప్పారు. ప్రజాక్షేత్రంలో ఓడిపోయినా.. కోర్టులో గెలుస్తామని.. న్యాయపోరాటం ఆపమని వెల్లడించారు.

చంద్రబాబు ఏ విధంగా అన్నారో.. ఎలా అన్నారో.. అచ్చుగుద్దినట్లు అలాగే జరిగింది. పరిషత్ ఎన్నికల పోలింగ్ మరో 36 గంటల్లో జరగనున్న క్రమంలో.. హైకోర్టు సింగిల్ బెంచ్.. ఎన్నికలపై స్టే విధిస్తూ తీర్పు వెల్లడించింది. టీడీపీ పోటీలోలేని ఎన్నికల వన్ సైడ్ గా జరగబోతున్నాయి అని అందరూ లైట్ తీసుకున్నారు.. సరిగ్గా ఇక్కడే పోలింగ్ పై స్టే రావటంతో అందరూ ప్రభుత్వం, ఎస్ఈసీ సైతం అవాక్కయ్యింది.

ఏమైనా చంద్రబాబు చెప్పిందే జరిగింది. న్యాయ పోరాటం ద్వారా కోర్టులో విజయం సాధిస్తాం.. గెలుస్తాం అన్నారు.. అన్నట్లే గెలిచారు. కాకపోతే ప్రజాక్షేత్రంలో మాత్రం పోటీ చేయకపోవటం మాత్రం బాధాకరం. ఎన్ని ఓట్లు పడతాయి.. ఓట్ల శాతం ఎంత వస్తుంది.. పార్టీ బలం ఎంత అనేది ప్రజాక్షేత్రం నుంచి చెప్పకలేకపోయినా.. కోర్టులో న్యాయం ఎలా జరుగుతుంది అనే విషయంలో మాత్రం చంద్రబాబు ఎప్పుడూ కరెక్ట్ గానే ఉంటారు అని చాలాసార్లు నిరూపించారు.. ఇప్పడు మరోసారి నిరూపించారు.

చంద్రబాబు మాట్లాడిన ఆ మాటలు కింద వీడియోలో ఉన్నాయి. తప్పక వినండి. ముఖ్యంగా 38:43 నుంచి 39:13 వరకు తప్పక వినండి

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు