2020 ఏప్రిల్ – 2021 ఏప్రిల్ తేడా ఏంటో తెలుసా.. ఈ ఏడాదిలో ఏం జరిగిందో తెలుసుకోండి..

corona in 2020 and 2021

దేశంలో కరోనా తీవ్రంగా ఉందన్న సంగతి కళ్లకు కనిపిస్తోంది. ప్రతి రోజూ 2 లక్షలకు పైగా కొత్త కేసులు వస్తున్నాయి. వేల సంఖ్యలో చనిపోతున్నారు. 2020 ఏప్రిల్ లో దేశంలో పరిస్థితి ఎలా ఉంది.. 2021 ఏప్రిల్ లో కరోనా సెకండ్ వేవ్ లో పరిస్థితి ఎలా ఉందో బ్రీఫ్ గా చూద్దాం..

2020 ఏప్రిల్ నెలలో ఇలా…

– కేసుల సంఖ్య విపరీతంగా ఉంది. రోజువారీ కేసుల సంఖ్య లక్షకు పైగా నమోదు అయ్యాయి.
– ఆస్పత్రుల్లో బెడ్స్ లేవు.
– అత్యవసర సమయంలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. చాలా మంది చనిపోయారు.
– అవసరం అయిన మేరకు వెంటిలేటర్లు లేవు.
– కరోనా చికిత్స కోసం మెడిసిన్స్ లేవు. రెమిడిసివర్ దొరకలేదు.
– ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్స్ కోసం లక్షలకు లక్షలు దోచుకున్నారు.
– లాక్ డౌన్ కారణంగా వ్యాప్తి తగ్గి.. అదుపులోకి వచ్చింది.

2021 ఏప్రిల్ నెలలో ఎలా ఉంది.

– కేసుల సంఖ్య విపరీతంగా ఉంది. రోజువారీగా కేసులు 2 లక్షల 71 వేలు నమోదు అవుతున్నాయి.
– కరోనా మరణాలు అయితే ఆల్ టైం హై 17 వందలకు చేరుకుంది.
– ఆస్పత్రుల్లో బెడ్స్ లేవు.
– అత్యవసర సమయంలో ఆక్సిజన్ కొరత ఉంది. చాలా మంది చనిపోతున్నారు.
– అవసరం అయిన మేరకు వెంటిలేటర్లు లేవు.
– కరోనా చికిత్స కోసం మెడిసిన్స్ లేవు. రెమిడిసివర్ దొరకటంలేదు.
– ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్స్ కోసం లక్షలకు లక్షలు దోచుకున్నారు.
– లాక్ డౌన్ లేదు.. వైరస్ మరింత బలంగా.. వ్యాప్తి చెందుతుంది. డబుల్ మ్యూటేషన్ తో ప్రాణాంతకంగా మారింది.
– వేయటానికి టీకాలు లేవు. వ్యాక్సిన్ కొరత ఉంది.

ఏడాది కాలంలో వైద్య రంగంలో మార్పులు రాకపోగా.. ఇంకా దరిద్రంగా తయారైంది. మరి ఈ 365 రోజులు కేంద్ర ప్రభుత్వం.. ప్రధాని మోడీ ఏం చేసినట్లు. ఒక్క మార్పు కూడా లేదు. జనమే ఎవరి చావు వాళ్లు చస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు