రఘురామకృష్ణంరాజు దారిలో ఒంగోలు ఎంపీ మాగుంట : ఆ ఇద్దరి తీరుతో అసంతృప్తి

రఘురామకృష్ణంరాజు దారిలో ఒంగోలు ఎంపీ మాగుంట : ఆ ఇద్దరి తీరుతో అసంతృప్తి

మాగుంట శ్రీనివాసులరెడ్డి.. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తలదైన ముద్ర వేసిన నేత. పెద్దగా మీడియాలో కనిపించకపోయినా.. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో.. ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తే అయినా.. తమిళనాడుతోనే ఎక్కవ ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే తెలుగు, తమిళనాడు రాష్ట్రాల్లోనే లిక్కర్ కింగ్ అతను. ప్రస్తుతం ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులరెడ్డి.

కాంగ్రెస్ నేతగా, ఎంపీగా సుదీర్ఘకాలం కొనసాగిన మాగుంట శ్రీనివాసరెడ్డి.. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ వైపు వచ్చారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత.. ఎమ్మెల్సీ అయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలోకి దిగి.. టీడీపీ అభ్యర్థి శిద్దా రాఘవరావుపై గెలుపొందారు. వైసీపీ ఎంపీగా గెలిచి.. 22 నెలలు అవుతున్నా.. ఎక్కడా కనిపించటం లేదు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి.

పంచాయతీ ఎన్నికలు ఆ తర్వాత మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు జెడ్పీ ఎన్నికలు జరుగుతున్నాయి. మూడు నెలలుగా ఎన్నికల హడావిడి జోరుగా ఉన్నా.. ఒంగోలు ఎంపీ మాగుంట మాత్రం ఎక్కడా కనిపించటం లేదు. అసలు ఎంపీ ఉన్నారా అనే డౌట్ ప్రజల్లో ఉంది. ఎంపీగా గెలిచిన తర్వాత చెన్నైకే పరిమితం అయ్యారని.. వ్యాపారాలపై దృష్టి పెట్టారనే టాక్ వినిపిస్తోంది.

కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలో ఓ వెలుగు వెలిగిన ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి.. వైసీపీ నుంచి ఎంపీగా గెలుపొందినా పెద్దగా గుర్తింపు లేకపోవటం ఏంటో ఎవరికీ అర్థం కావటం లేదు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా రాజకీయం మొత్తాన్ని ఒంటి చేత్తో నడిపిస్తున్నారు మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి. తెర వెనక టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉండనే ఉన్నారు. ఇద్దరు ఉద్దండుల మధ్య మాగుంట సైలెంట్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది.వీరి ఆధిపత్యం కారణంగా మాగుంట్ సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి ఉందని ఒంగోలు రాజకీయా వర్గాల్లో చర్చ నడుస్తుంది.

అన్నింటి కంటే ముఖ్యంగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ విధానాన్ని సంపూర్ణంగా మార్చేసింది. బ్రాండెడ్ లిక్కర్ బ్యాన్ చేసి.. తమిళనాడు తరహా మద్యం విక్రయాలు సాగిస్తుంది. ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లిక్కర్ తయారీ యూనిట్లను తమ ఆధీనంలోకి తీసుకున్న ప్రభుత్వం.. కొత్త బ్రాండ్లతో లిక్కర్ తయారీ, విక్రయాలు చేపట్టింది. ఇక్కడే మాగుంట శ్రీనివాసులరెడ్డికి కోపం వచ్చిందంట. మాగుంట శ్రీనివాసులరెడ్డి లిక్కర్ ఫ్యాక్టరీల నుంచి బ్రాండెడ్ మద్యం తయారు అవుతుంది. ఎంపీగా ఉన్నా.. తన వ్యాపారంపై దెబ్బకొట్టారనే బాధతో ఉన్నారంట. దీనికితోడు మాగుంటకు చెందిన లిక్కర్ తయారీ ఫ్యాక్టరీలను ప్రభుత్వానికి ఇవ్వటానికి అంగీకరించలేదంట. అవసరం అయితే ఫ్యాక్టరీలు మూసేసుకుంటా.. తమిళనాడులో అమ్ముకుంటా.. అంతేకానీ ఏపీ ప్రభుత్వానికి ఇచ్చేది లేదని స్పష్టం చేశారంట. ఈ విషయంలో మాగుంట శ్రీనివాసులరెడ్డి గుర్రుగా ఉన్నారంట.. పార్టీకి దూరంగా ఉంటున్నారు.

ఓ రకంగా చెప్పాలంటే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లాగే మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా బయటకు వస్తారనుకున్నారు కానీ.. మాగుంట మాత్రం అలా చేయకుండా.. పార్టీకి దూరంగా తమిళనాడులో వ్యాపారం చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్నారంట. ఎవరైనా ఫోన్ చేస్తే.. నా వయస్సు 68 సంవత్సరాలు.. కరోనా ఉంది.. జాగ్రత్తగా ఉండాలి కదా అని చెబుతున్నారంట.

See also: ఎన్వీ రమణ చీఫ్ జస్టిస్ అయితే.. టీడీపీలో సంబురాలు ఏంటీ ?

See also : నిమ్మగడ్డ పెట్టిన ఆ చివరి సంతకం.. కొత్త చరిత్రను రాసింది

See also : ప్రజాక్షేత్రంలో ఓడిపోయినా.. కోర్టులో గెలుస్తాం : ముందే చెప్పిన చంద్రబాబు

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు