కోట శ్రీనివాసరావు ఆరోగ్యానికి ఏమైందీ

కోట శ్రీనివాసరావు ఆరోగ్యానికి ఏమైందీ.. ఆయన్ను చూసి అందరూ షాక్ అయ్యారు. వయస్సు రీత్యా కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు

kota srinivasarao health condition
kota srinivasarao health condition

సీనియర్ నటుడు.. విలక్షణ పాత్రల నటుడు కోట శ్రీనివాసరావు ఆరోగ్యం బాగోలేదని అతని పరిస్థితిని చూస్తేనే అర్థం అవుతుంది. జీహెచ్ఎంసీ పోలింగ్ సందర్భంగా.. మంగళవారం ఫిల్మ్ నగర్ లో తన భార్యతో కలిసి వచ్చి ఓటు వేశారు. ఈ సమయంలో ఆయన్ను చూసిన అభిమానులు షాక్ అయ్యారు.

ఓటు హక్కు వినియోగించుకున్నారు. 73 ఏళ్ల కోట ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసినా.. మరీ ఇంత బాధపడుతున్నారా అని ఫీలవయ్యారు ఆ వీడియో చూసిన అభిమానులు. ఓటు గుర్తు ఉన్న వేలిని చూపించటానికి సైతం.. మరో చేయి సాయం తీసుకుంటున్నారు. చాలా బలహీనంగా ఉన్నారు. మరో వ్యక్తి సాయం లేకుండా సొంతంగా నడిచే విధంగా కూడా లేరు.

తన భార్యతో కలిసి వచ్చి ఫిల్మ నగర్ లోని పోలింగ్ బూత్ లో ఓటు వేసిన ఆయన్ను చూసి అందరూ షాక్ అయ్యారు. వయస్సు రీత్యా కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు