దుబ్బాకకి టీఆర్ఎస్ లీడర్ కావాలి..

అప్పుడు అసలుకే మోసం వస్తుంది. సో.. దుబ్బాక నియోజకవర్గానికి అత్యవసరంగా

దుబ్బాక నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత ఓడిపోయారు.. ఇప్పుడు ఆమె నియోజకవర్గాన్ని లీడ్ చేసే పొజిషన్ లో లేరు.. నెంబర్ 2గా ఉన్న చెరుకు శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు.. ఇప్పుడు దుబ్బాకకు టీఆర్ఎస్ లీడర్ ఎవరు.. నియోజకవర్గం కార్యకర్తలకు అందుబాటులో ఉండేది ఎవరు.. బీజేపీ అభ్యర్థి, ఎమ్మెల్యే రఘునందన్ రావును ఎదుర్కొనే సత్తా ఉన్న లీడర్ ఎవరు.. ఇదే టీఆర్ఎస్ పార్టీలో చర్చ అయ్యింది.

మంత్రి హరీశ్ రావు అటు గజ్వేల్, ఇటు సిద్ధిపేట చూసుకోవాలి. ఇప్పుడు దుబ్బాక కూడా చూసుకోవాలి అంటే కష్టం అయిపోతుంది.. అందులో అభ్యర్థి ఓడిపోయి ఉన్నారు.. సుజాత స్వతహాగా పార్టీ వ్యవహారాలను చక్కదిద్దే పరిస్థితి లేకపోవటంతో.. టీఆర్ఎస్ క్యాడర్ అంతా నిరుత్సాహంగా ఉంది.
ఫస్ట్ టైం.. టీఆర్ఎస్ కంచుకోటగా భావించే ఉత్తర తెలంగాణలోని ఓ నియోజకవర్గంలో పార్టీకి అభ్యర్థి కరువు కావటం సంచలనంగా మారింది.

దుబ్బాకలో రఘునందన్ రావును ఢీకొని.. పార్టీ క్యాడర్ ను కాపాడుకునే సమర్థుడైన నేత ఎవరు ఉన్నారు అనేది ఇప్పుడు దుబ్బాక టీఆర్ఎస్ లోనే హాట్ టాపిక్.
సిద్ధిపేట – దుబ్బాక రెండు కళ్లు అన్న మంత్రి హరీశ్ రావు.. ఒక కన్నును కోల్పోయారు.. సిద్ధిపేట కాదని దుబ్బాకపై దృష్టిపెడితే.. ప్రత్యర్థులు సిద్ధిపేటను టార్గెట్ చేస్తారు.. అక్కడ రెచ్చిపోతారు. అప్పుడు అసలుకే మోసం వస్తుంది. సో.. దుబ్బాక నియోజకవర్గానికి అత్యవసరంగా టీఆర్ఎస్ లీడర్ కావాలి..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు