సాగర్ ఎన్నిక అయిపోయింది కదా.. ఇక పీసీసీ చీఫ్ ఎవరు.. జానా గెలిస్తే ఆయనకే ఇస్తారా..

సాగర్ ఎన్నిక అయిపోయింది కదా.. ఇక పీసీసీ చీఫ్ ఎవరు.. జానా గెలిస్తే ఆయనకే ఇస్తారా..

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త చీఫ్.. అదేనండీ పీసీసీ చీఫ్ ఎవరు అనేది మళ్లీ రైజ్ అయ్యింది. రెండు నెలల క్రితమే ఫైనల్ అయ్యి ప్రకటించాల్సి ఉన్నా.. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక క్రమంలో.. సాగర్ అభ్యర్థి జానారెడ్డి విన్నపంతో వాయిదా వేసింది హైకమాండ్. ఏప్రిల్ 15వ తేదీతో ప్రచారం ముగిసింది. 17వ తేదీ పోలింగ్ జరగబోతుంది.. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ చీఫ్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.

పీసీసీ చీఫ్ రేసులో అప్పట్లో మూడు పేర్లు ప్రధానంగా వినిపించాయి. ఒకరు రేవంత్ రెడ్డి.. మరొకరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. మరొకరు జీవన్ రెడ్డి. ఇప్పుడు కొత్తగా మరోపేరు తెరపైకి వచ్చింది. అతనే జానారెడ్డి. నాగార్జుసాగర్ ఉప ఎన్నికలో గెలిస్తే.. ఆయనకే పీసీసీ చీఫ్ పదవి ఇచ్చే అవకాశం ఉందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

అప్పట్లో ఎంపిక ఆగిపోవటానికి కారణం ఇదే అంటున్నారు. జానారెడ్డి మోస్ట్ సీనియర్. అతని మాట అంటే అందరికీ గౌరవం. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ దగ్గరకు నేరుగా వెళ్లగలరు. అలాంటి వ్యక్తి చెప్పారు కాబట్టే పీసీసీ చీఫ్ ప్రకటన ఆగిపోయింది. దానికి సాగర్ ఎన్నికను లింక్ చేశారు. ఇప్పుడు నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో జానారెడ్డి గెలిస్తే.. ఆయన్నే పీసీసీ చీఫ్ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. సాగర్ లో అతని గెలుపు ఖాయం అని.. ఆ తర్వాత రాష్ట్ర నాయకత్వం బాధ్యతలు స్వీకరించటం జరుగుతుందని అతని వర్గం బలంగా విశ్వసిస్తోంది.

రేవంత్ రెడ్డి ఖాయం అని జోరుగా ప్రచారం జరిగినా.. అధికారిక ప్రకటన ఒక్కటే మిగిలి ఉందని అందరూ భావించినా.. అది కార్యరూపం దాల్చలేదు. టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తికి ఎలా ఇస్తారని కాంగ్రెస్ పార్టీ కురు వృద్ధులు బహిరంగంగా విమర్శలు, కంప్లయింట్స్ చేయటంతో అధిష్టానం వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. మళ్లీ ఇప్పుడు రేవంత్ రెడ్డి రేసులోకి వస్తారా.. అధిష్టానం తెలంగాణపై దృష్టి పెడుతుందా లేదా అనేది కూడా చూడాలి

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు