ఎవరితను.. ఎప్పుడు చూసినా షర్మిల వెనకాలే ఉంటాడు?.. వైఎస్ఆర్ ఫ్యామిలీతో ఉన్న అనుబంధం ఏంటీ?

ఎవరితను.. ఎప్పుడు చూసినా షర్మిల వెనకాలే ఉంటాడు?.. వైఎస్ఆర్ ఫ్యామిలీతో ఉన్న అనుబంధం ఏంటీ?

Who is Pitta Ramreddy..
Who is Pitta Ramreddy..

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఖమ్మం వేదికగా గ్రాండ్ లాంఛింగ్ జరిగింది. లక్షల మంది వైఎస్ఆర్ అభిమానులతో సభా ప్రాంగణం, వేదిక కోలాహలంగా.. నూతన ఉత్సాహాన్ని నింపింది అభిమానుల్లో. ఈ వేదికపైనే కాదు.. పార్టీ అధినేత షర్మిల ఎక్కడికి వెళ్లినా.. ఎక్కడ మీటింగ్ పెట్టినా ఆమె వెనక ఒక వ్యక్తి రెగ్యులర్ గా కనిపిస్తూ ఉంటాడు. ఇంతకీ ఎవరు అతను.. వైఎస్ఆర్ ఫ్యామిలీతో ఉన్న అనుబంధం ఏంటీ.. షర్మిలకు ఎలా పరిచయం.. పార్టీలో అతని రోల్ ఏంటీ అనేది అందరిలో ఆసక్తి రేపుతోంది. ఇప్పుడు వివరాలే ఎక్స్ క్లూజివ్ గా అందిస్తున్నాం..

అతని పేరు పిట్టా రామిరెడ్డి. నల్గొండ జిల్లా సూర్యపేట వాసి. సూర్యపేట నియోజకవర్గం వైఎస్ఆర్ వీరాభిమానిగా గుర్తింపు పొందాడు. ప్రధాన వృత్తి వ్యవసాయం. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు పిట్టా రాంరెడ్డి. తన చదువుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సాయం చేశారనే కృతజ్ణతతో ఆయన వెంటే నడిచాడు రాంరెడ్డి. వైఎస్ఆర్ మరణంతో.. జగన్ వెంట నడిచారు. సూర్యపేట నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ ఇంచార్జిగా కొనసాగుతున్నారు.

see this : సీఎం జ‌గ‌న్ తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌ ర‌ద్దు.. ఎన్నిక‌ల ప్ర‌చారానికి దూరం.. కార‌ణం ఇదే

తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోయినా.. వైఎస్ఆర్ కుటుంబ అభిమానిగా.. జగన్ వెంటే ఉన్నారు. ఆ పార్టీ వెంటే తిరిగారు. తెలంగాణలో జగన్ ప్రతి పర్యటన వెనక రాంరెడ్డి ఉన్నారు. 2014 నుంచి సూర్యపేట నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిగా కొనసాగుతూనే ఉన్నారు.

ఆ అభిమానమో ఏమో గానీ.. నమ్మకున్న వారికి అన్యాయం చేయరు జగన్ అన్నట్లు.. 2019లో సీఎం అయిన వెంటనే.. తిరుమల తిరుపతి దేవస్థానంలో లోకల్ అడ్వైజరీ కమిటీలో సభ్యునిగా పిట్టా రాంరెడ్డిని నియమించారు. ఓ రకంగా పాలక మండలి సభ్యుని తర్వాత హోదా ఇది. తెలంగాణకు చెందిన పిట్టా రాంరెడ్డిని స్వయంగా ఈ పదవిలో నియమించారు సీఎం జగన్. వైఎస్ఆర్ ఫ్యామిలీకి అంత విధేయత ఇతనిలో ఉంది కాబట్టి.. పిలిచి పదవి ఇచ్చారు.

టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి చాలా సార్లు చాలా మంది పార్టీలోకి ఆహ్వానించారు పిట్టా రాంరెడ్డిని. ఎప్పుడూ కూడా అలాంటి పక్క చూపులు చూడకుండా నిఖార్సయిన అభిమానిగా ఉండిపోయాడు. ఈ విధేయతే ఇప్పుడు వైఎస్ షర్మిలకు ఆప్తుడుగా ఉండటానికి కారణం. వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టాలి అనుకున్నప్పుడు మొదటగా నల్గొండ జిల్లానే ఎంచుకుంది. వారితో సమావేశం అయ్యింది. మొదటి ఆత్మీయ సమ్మేళనాన్ని పెద్ద ఎత్తున హిట్ చేశారు పిట్టా రాంరెడ్డి. నల్గొండ, సూర్యపేట నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు, అభిమానులను తీసుకురావటంలో సత్తా చూపించాడు.

అన్నింటికి మించి వైఎస్ ఫ్యామిలీ సభ్యులకు నోట్లో నాలుకలా ఉంటారు పిట్టా రాంరెడ్డి. దీనికితోడు సౌమ్యుడు, నిదానపరుడు, కోపం తక్కువ.. సహనం ఎక్కువ.. ఇలాంటి లక్షణాలు సైతం రాంరెడ్డికి వైఎస్ ఫ్యామిలీకి మరింత దగ్గర చేశాయి.

కొన్ని రోజులుగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలోని ఈ వ్యక్తి ఎవరు.. ఏ మీటింగ్ జరిగినా ఇతను కనిపిస్తాడు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్స్/ ప్రశ్నలకు సమాధానమే ఈ స్టోరీ..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు