పరీక్షలు రద్దు – ఎన్నికలు ముద్దు : రాయలేని భూతులతో తెలంగాణ సర్కార్ ను తిడుతున్న జనం

పరీక్షలు రద్దు - ఎన్నికలు ముద్దు : రాయలేని భూతులతో తెలంగాణ సర్కార్ ను తిడుతున్న జనం

అడ్డదిడ్డంగా రాశాడని అభిమానులకున్నా, మా పార్టీని కావాలని టార్కెట్ చేశాడని కార్యకర్తలు అనుకున్న రాయక తప్పదు కాబట్టి, ఈ కరోనా సమయంలో తలతిక్క నిర్ణయాలు తీసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వాన్ని రాయలేని భూతులతో జనం ఏ  రేంజ్ లో తిట్టుకుంటున్నారో, రాయగలిగే భూతులతో కాస్త కఠినంగానే రాసి చెప్తున్నాం చూసి చదువుకోండి.

ఆన్ లైన్ క్లాసులతో ఇంట్లోనే ఉండి చదువుకుంటున్నారు.. పరీక్ష అంటేనే దూరంగా కూర్చుని.. సామాజిక దూరం పాటిస్తూ రాసేది. కరోనా టైంలో ఆ దూరాన్ని పెంచితే సరిపోతుంది కదా.. ఆ మాత్రం జాగ్రత్తలుగా కూడా తీసుకోలేని ప్రభుత్వం.. పరీక్షలు రద్దు చేస్తోంది.

ఇదే సమయంలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తుంది. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ ఇలా ఇచ్చింది. ప్రచారం, ఇంటింటికీ వెళ్లి తిరగటం, సభలు, సమావేశాలు, చర్చలు, భేటీల ద్వారా పెద్దలకు కరోనా వస్తే.. వాళ్లు ఇళ్లకు వెళ్లి పిల్లలకు అంటించారా ఏంటీ.. ప్రపంచంలో ఎక్కడా లేని వింత తెలంగాణ ప్రభుత్వంలోనే జరుగుతుందని ఇళ్లల్లో చర్చించుకుంటున్నారు.

ఇదేం ప్రభుత్వం రా నాయానా ! అబ్బో కరోనా పీక్స్ లో ఉంది అని పరీక్షలు రద్దు చేసి పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది ఈ ప్రభుత్వం, వాళ్లకి ఉపయోగపడే ఎన్నికలని మాత్రం నిర్వహించుకుంటాం అని నోటిఫికేషన్ ఇచ్చింది.

— సీనియర్ మోస్ట్ విద్యావేత్త

నాకో డౌటు మాస్టారు, చక్కగా పద్దతిగా క్రమశిక్షణతో పరీక్షలు రాసే విద్యార్థుల కంట్రోల్ చేయడం ఈజీయా లేక అడ్డదిడ్డంగా తాగి మైకులు పట్టుకోని గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రచారం చేసే పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని వేలల్లో పోగయ్యే జనాన్ని కంట్రోల్ చేయడం ఈజీయా.

— ఒక సాధారణ పౌరుడి డౌట్

కరోనా ఫుల్ గా పెరుగుతుందని పరిక్షలు ఎత్తేయడమో, పోస్ట్ పోన్ చేయడమో చేశారు.. అదుర్స్, కానీ పిల్లల పరీక్షలకు వారి బంగారు భవిష్యత్తుకు అడ్డువచ్చిన కరోనా మీకు మీ బంగారు రాజకీయ భవిష్యత్తుకు ఎందుకు రాలేదంటారు, కరోనాతో ప్రభుత్వం ఇన్ సైడర్ ట్రేడింగ్ ఏమైనా చేసుకుందా.

— ఆవేశం ఉన్నా గొంతెత్తి ప్రశ్నించలేని వ్యక్తి అంతర్గతం

ఓ సారూ, పదోతరగతి పిల్లలు మనతాన తిప్పి తిప్పి కొడితే ఓ 5 లచ్చల చిల్లర ఉంటరు, బుద్ధిగా సదువుకోని, పరీచ్చలు రాసుకుంటరు,ఈ ఎన్నికల్లో పదిపదేహేను లచ్చలు ఉంటరు,మంది మీదమ్మటి బడి ఓ ఉరుకుతుంటరు, తాగి గొడవల్ జేత్తరు. ఇదేం లెక్క సారు ఎన్నికలు ఆపాలెగని,పరీచ్చలు ఆపుడేంది.

–కూలికి బోయి మనవరాల్ని చదివించుకునే ఓ అవ్వ

పక్క రాష్ట్రంలో పరీక్షలు చక్కగా జరుగుతున్నాయి, చక్కగా కరోనా పరీక్షలు చేసి ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇస్తున్నారు, ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ ఇస్తున్నారు, మన దగ్గర ఏంటయ్యా అంటే.. కరోనా టెస్ట్ ఎక్కడ చేస్తారో తెలియదు, వ్యాక్సిన్ ఎక్కడ వేస్తారు తెలియదు… ఉద్యోగాలు లేవు, చదువులు లేవు.. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రా లేక ఫాం హొస్ ముఖ్యమంత్రి. కరోనా టైమ్ చూసి తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఎన్నికలు పెట్టాడు. అసలు ఎన్నికలకు లేని కరోనా పిల్లల పరీక్షలకు ఏంటయ్యా, ఇది ప్రతి పక్షాలను చంపడానికి చేస్తున్న కుట్ర.

— సమయం, సందర్భం లేకుండా అవకాశం కోసం చూసే ప్రతి పక్షనేత

పాపం, అయినా వారు అనడంలో తప్పు ఏం లేదు, అసలే కరోనా భవిష్యత్తు ఏంటో అర్థం కాక అల్లాడుతున్నారు. సింపుల్ గా పరీక్షలు రద్దు అని ఒక మాట చెప్పి ఊరుకున్నారు, తరువాత పరిస్థితి ఏంటీ, నీట్ , గీట్ అంటూ ఉండే పరీక్షల పరిస్థితి ఏంటి అనేది క్లారీటీ ఇవ్వలేదు. అద్భుతంగా చదువుకునే వారిని, ఓవర్ నైట్ చదివి పరీక్షలు రాసే వారిని తెచ్చి ఒక దగ్గర పడేశారు.చదువుకునే వాళ్ల ఓళ్లు మండదా మరీ.

అంచేత.. ఫైనల్ గా చెప్పోచ్చేదేంటంటే… ఇంతకంటే ఎక్కువ చెబితే.. ఏదో కావాలని బురద చల్లామని నామర్థ ఎందుకు. మీకు నచ్చింది,చెప్పేది ఏమన్నా ఉంటే.. ఆ కింద కామెంట్స్ లో పడేయండి.. నచ్చిందనుకుంటే మూడు ఫేస్ బుక్ షేర్లు, ఆరు వాట్సాప్ షేర్లు చేయండి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు