జనవరి-జూన్‌ మధ్య కాలంలో మావోయిస్టులు దాడులు ఎందుకు చేస్తారంటే ?

జనవరి-జూన్‌ మధ్య కాలంలో మావోయిస్టులు దాడులు ఎందుకు చేస్తారంటే ?

చత్తీస్‌గఢ్ : చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ అటవి ప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా దళాలకు జరిగిన పోరులో 24 మంది జవాన్లు మరణించగా మరో ఏడుగురు జవాన్లు గల్లంతు అయినట్టు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం లేద గతంలో జరిగినటువంటి మావోయిస్టుల మెరుపు దాడుల తీరును ఒకసారి గమనించినట్టయితే, అన్ని దాడులు ఎక్కువగా జనవరి జూన్ మధ్య కాలంలో జరిగినట్టు స్పష్టంగా అర్థం అవుతుంది. అసలు మావోయిస్టులు ఎక్కువ ఈ కాలంలోనే ఎందుకు దాడులు చేస్తారు. జూలై – డిసెంబర్ మధ్య కాలంలో ఎందుకు సైలెంట్ అయిపోతారు అనే దానికి స్పష్టమైన కారణం ఉంది.

జనవరి-జూన్ మధ్య కాలంలోనే మావొయిస్టుల దాడులు ఎందుకంటే ?

మావోయిస్టులు ఎక్కువగా దట్టమైన అటవి ప్రాంతాల్లో ఉంటారనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. సాధారణంగా జనవరి నుండి జూన్ మధ్య కాలల్లో అడవుల్లోని చెట్ల ఆకులు రాలిపోయే దశలోనే లేదా అప్పుడప్పుడే చిగురిస్తున్న దశలోనో ఉంటాయి.దాదాపు అన్ని భారీ వృక్షాలు రాలిపోయిన ఆకులతో మోడులు తేలి ఉంటాయి. దట్టమైన పొదలు వంటివి కూడా చాలా తక్కువగా ఉంటాయి.

ఇలాంటి సమయంలో అడవుల్లో తిరిగే వారి జాడను కనిపెట్టడం తేలిక అవుతుంది.అడవుల్లో కూంబింగ్ నిర్వహించే జవాన్ల కదలికలు కూడా దూరం నుండే స్పష్టంగా అర్థం అవుతాయి. ఇక అడవి అంటే మావోయిస్టులు ఉండే ప్రాంతం కాబట్టి వారికి ప్రతి అంగుళం మీద స్పష్టమైన అవగాహాన ఉంటుంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మావోయిస్టులు కావాలనే తమ ఆచూకిని పోలీసులకు చేరవేసి, వారిని అడవిలోకి రప్పిస్తారు.

ఒకసారి జవాన్లు అడవిలోకి వెళ్లిన తరువాత తాము అనుకున్న ప్లాన్ ప్రకారం చుట్టు ముట్టి ఎక్కువ మందికి నష్టం చేసే విధంగా దాడులు చేస్తారు.మిగిలిన సమయాల్లో తమ వద్దకు వచ్చే భద్రత బలగాలను ఎదుర్కోనే మావోయిస్టులు, జనవరి – జూన్ మధ్య కాలంలో మాత్రం తమ వద్దకు భద్రతా బలగాలు వచ్చేట్టు ప్లాన్ చేసి మరి దాడులకు దిగుతారు.

See also : మూడు రాష్ట్రాలకు అతడే టార్గెట్ : పట్టిస్తే 50 లక్షల రివార్డ్-అతని పేరు చెప్పగానే పరుగెత్తుకెళ్లిన పోలీసులు

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు