భార్యను హత్య చేసి స్కూటీపై తీసుకెళ్లిన భర్త

భార్యను హత్య చేసి స్కూటీపై తీసుకెళ్లిన భర్త

కట్టుకున్న భార్యను కడతేర్చి, స్కూటీపై తీసుకెళ్లాడో భర్త. ఈ దారుణ ఘటన ఆదివారం గుజరాత్ లోని రాజ్ కోట్ లో జరిగింది. కాగా స్కూటీపై తీసుకెళ్తుండగా గమనించిన స్థానికులు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఘటన వివరాల్లోకి వెళితే, హేమ్‌నాని స్థానిక ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూషన్‌ ఏజెన్సీలో పని చేస్తున్నాడు. అయితే ఆదివారం కావడంతో భర్త డ్యూటీకి వెళ్ళలేదు. ఈ నేపథ్యంలోనే ఇంట్లో భార్యాభర్తల మధ్య చిన్న గొడవ మొదలయ్యింది.

అది కాస్తా పెద్ద గొడవగా మారడంతో హేమ్‌నాని ఆగ్రహంతో భార్య నైనా గొంతుపిసికి చంపాడు. కొద్దీ సేపటితర్వాత ఆమె డైడ్ బాడీ తీసుకోని రోహిషాల గ్రామం వైపు వెళ్లసాగాడు. హ్యాండిల్‌, ఫూట్‌ రెస్ట్‌కి మధ్య నైనా మృతదేహాన్ని ఉంచాడు. దాంతో ఆమె కాళ్లు నేల మీద ఉన్నాయి. ఇదేం పట్టించుకోకుండా అలానే ఓ 10 కిలోమీటర్ల దూరం లాక్కెళ్లాడు.

స్థానికులు గమనించి స్కూటీ ఆపాలని అరిచారు. కానీ వారిని చూసి హేమ్‌నాని వేగం పెంచారు. దాంతో స్థానికులు తమ వాహనాల మీద అతడి వెనకే వెళ్లి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా పాలితాన ఎస్సై మాట్లాడుతూ దర్యాప్తులో నిందితుడు తన భార్య శవాన్ని పాలితాన తాలూకాలోని రోహిషాల గ్రామం చివర ఉన్న అటవి ప్రాంతంలో పడేయాలని భావించినట్లు తెలిపాడు.

ఇక తన భార్యను హత్య చేయడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదని అన్నారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం చెబుతామని తెలిపారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు