ప్రియుడితో రాసలీలలు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త

ప్రియుడితో రాసలీలలు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త

తాళికట్టిన భర్తను మోసం చేసి ప్రియుడుతో ఏకాంతంగా గడుపుతున్న భార్యను, ఆమె భర్త రెడ్ హ్యాండెండ్ గా పోలీసులకు పట్టించారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పట్టణంలోని రామలక్ష్మీకొట్టాల రెండో వీధిలో ఓ ఆటోడ్రైవర్‌ వాసం ఉంటున్నాడు.

అయితే ఆయన ఇంటికి అప్పుడపుడు ఓ సామాజికవర్గానికి చెందిన హక్కుల సాధన పోరాట సమితి నాయకుడు వస్తుంటాడు.. ఈ నేపథ్యంలోనే ఆటో డ్రైవర్ లేని సమయంలో పలు మార్లు ఇంటికి వచ్చి మహిళకు మాయమాటలు చెప్పి ఆయన బుట్టలో వేసుకున్నాడు.

గత కొద్దీ రోజులుగా భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో సదరు వ్యక్తిని ఇంటికి రావద్దని మందలించాడు. అయినా అతడి మాట వినకుండా ఎదో ఒక ఒంటతో ఇంటికి వస్తుండేవాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడితో మహిళ రాసలీలలు కొనసాగిస్తుండగా ఇరుగుపొరుగువారు గమనించి ఫోన్ చేశాడు.

దింతో భర్త నేరుగా ఇంటికి వచ్చి గదికి తాళం వేశాడు.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు రాగానే తాళం తీసి పోలీసులకు పట్టించాడు. మంగళవారం ఉదయం వచ్చి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని బాధితుడు చెప్పారని, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని సీఐ సుబ్రమణ్యం తెలిపారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు