ఫ్యామిలీలు ఫ్యామిలీలే బరిలో దిగుతున్నాయి

లిస్టులో కేకే కూతురితో సహా.. మంత్రి తలసాని కోడలు, మరో మంత్రి మల్లారెడ్డి

జీహెచ్ఎంసీలో గెలుపు కోసం.. మేయర్ పీఠం దక్కించుకునేందుకు.. కుటుంబాల్లోనే చిచ్చు పెడుతున్నాయి రాజకీయాలు. తమ ఇంటి మహిళలే గ్రేటర్‌ రాణి కావాలని పట్టుబడుతున్నారు. అందుకు తగ్గట్లుగా వారిని కధనరంగంలోకి దించేందుకు సిద్ధమవుతున్నారు.

క్రితం ఎన్నికల్లో కేకే కూతురికి మేయర్ పీఠం ఇస్తారనే ప్రచారం సాగింది. అంచనాలు తలకిందులు కావడంతో వ్యవహారం బెడిసికొట్టింది. పీఠంపై బొంతు రామ్మోహన్ కూర్చున్నారు. ఈ సారి జనరల్ మహిళకు కేటాయించడంతో.. బడా మంత్రులంతా తమ ఇళ్లలోని మహిళలను ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్‌ దగ్గర ప్రస్తావించిన సదరు లీడర్లు.. బీ ఫామ్‌ కోసమే వేయిటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

లిస్టులో కేకే కూతురితో సహా.. మంత్రి తలసాని కోడలు, మరో మంత్రి మల్లారెడ్డి కూతురు, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు కోడలు, ఆల్‌రెడీ మేయర్‌గా ఉన్న బొంతు రామ్మోహన్‌ భార్య, పీజేఆర్‌ కూతురు విజయ మేయర్‌ పీఠం రేసులో ఉన్నారు.

ఏదేమైనా.. ఇంతమందిలో పీఠాన్ని అధిరోహించేదెవరో..? గ్రేటర్‌ రాణి ఎవరో..? అన్నది తేలడం ఆషామాషీ వ్యవహారం కాదని.. టఫ్ ఫైట్ తప్పదని చెప్పొచ్చు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు