సాంకేతిక సమస్య ని ఎదురుకుంటున్న గూగుల్ మెసేజింగ్ యాప్

ఎప్పుడైతే గూగుల్ క్యారియర్ సర్వీసెస్ యాప్ ని అప్డేట్ చేస్తున్నారో, ఎస్ఎంఎస్ పంపేటప్పుడు వారు దాదాపు 30 నిముషాల లాగ్స్ సమస్యను ఎదుర్కుంటునాము అని వినియోగదారులు పలు సోషల్ మీడియా లో పోస్టులు వేస్తున్నారు

సాంకేతిక సమస్య ని ఎదురుకుంటున్న గూగుల్ మెసేజింగ్ యాప్

ఎస్ఎంఎస్ యాప్ నుండి సమస్యలు ఎదురుకుంటున్నామని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు ఫిర్యాదు లో పేర్కొంటున్నారు. ఆండ్రాయిడ్ సెంట్రల్ వారు మొదటగా ఈ లోపాన్ని గుర్తించినట్లు తెలుస్తుంది. ఎప్పుడైతే గూగుల్ క్యారియర్ సర్వీసెస్ యాప్ ని అప్డేట్ చేస్తున్నారో, ఎస్ఎంఎస్ పంపేటప్పుడు వారు దాదాపు 30 నిముషాల లాగ్స్ సమస్యను ఎదుర్కుంటునాము అని వినియోగదారులు పలు సోషల్ మీడియా లో పోస్టులు వేస్తున్నారు. ప్రధానంగా రెడ్దిట్, పలు ఫోరమ్లలో మొరపెట్టుకున్నప్పటికి గూగుల్ లేదా స్మార్ట్ఫోన్ తయారీదారులు స్పందించలేదు.

ఒకవేళ మీరు ఈ ఇష్యూ నుండి బయటపడాలి అని అనుకుంటే గనుక మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ నుండి గూగుల్ క్యారియర్ సర్వీసెస్ యాప్ తక్షణమే అన్ ‌ఇన్‌స్టాల్ చేయండి. ఇలా అన్ ‌ఇన్‌స్టాల్ చేయడంతో మీరు తాత్కలితంగా సమస్య నుండి బయటపడతారని నిపుణులు చెపుతున్నారు. అందుకు మీరు చేయవలసినది ప్లే స్టోర్ లోకి వెళ్లి, మెనులో యాప్స్, గేమ్స్ ని క్లిక్ చేయండి.. మీరు ‌ఇన్‌స్టాల్ చేసిన లిస్ట్ అఫ్ అప్లికేషన్స్ స్క్రీన్ పై చూపిస్తుంది. అందులో క్యారియర్ సర్వీసెస్ ని అన్ ‌ఇన్‌స్టాల్ చేయటమే.

క్యారియర్ సర్వీసెస్ గూగుల్ మెసేజ్ యాప్ సరికొత్త ఫీచర్లను, కమ్యూనికేషన్ సర్వీసెస్ ఎనేబుల్ చేస్తుందని మీరు గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఇంకెప్పుడు దీనిని మళ్లీ ఇన్‌స్టాల్ చేయకపోతే ఏ క్రొత్త ఫీచర్‌లను భవిష్యత్ లో వాడలేరు. గూగుల్ లేదా స్మార్ట్ ఫోన్ తయారీదారుల ఇటువంటి ఎస్ఎంఎస్ యాప్ లో సమస్యను ఎపుడు పూర్తిగా పరిష్కరిస్తారో తెలీదు కాబట్టి, అంతవరకు గూగుల్ క్యారియర్ సర్వీసెస్ యాప్ ని అన్ ‌ఇన్‌స్టాల్ చేయటమే మంచిది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు