అడుగు దూరంలో కుప్పకూలిన బ్రిడ్జ్ – ప్రాణాలతో బయటపడ్డ రిపోర్టర్

bridge has collapsed in feets distance

భారీగా కురుస్తున్న వర్షాల కారణం ఒక బ్రిడ్జ్ ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన అమెరికాలోని నార్త్ కరోలినాలో చోటుచేసుకుంది. ఇది పెద్ద షాకింగ్ వార్త కాకపోయినప్పటికి, ఒక్కసారిగా కుప్పకూలిన ఆ బ్రిడ్జ్ కి కేవలం అడుగుల దూరంలో ఉన్న స్థానిక టీవీ ఛానెల్ రిపోర్టర్ ప్రాణలతో బయటపడటమే ఇక్కడ షాకింగ్ వార్త.

స్థానికంగా కురుస్తున్న వర్షాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో వివరించడానిక ఒక బ్రిడ్జ్ ను ఎంచుకున్న రిపోర్టర్ ఏంబర్ రాబర్ట్స్ , ఆ బ్రిడ్జ్ మీదకు వెళ్లి ,” చూడండి నీళ్లు ఎలా బ్రిడ్జ్ ను తాకుతూ వెళ్తున్నాయో, చూస్తుంటే ఇది భయంకరంగా ఉంది, ఈ బ్రిడ్జ్ ఏక్షణంలో కూలుతుందే తెలియని పరిస్థితి,” అని చెప్పి పక్కకు వచ్చిన కొన్ని క్షణాల్లోనే ఆ బ్రిడ్జ్ కూలిపోయింది.

అదృష్టం తన వైపే ఉన్నది అనుకున్న ఆ రిపోర్టర్ తన రికార్డ్ చేసుకున్న లైవ్ క్లిప్ ను తన ట్విట్టర్ లో పెట్టి, ” అదృష్టం కొద్ది నేను నా వీడియో జర్నలిస్ట్ క్షేమంగా ఉన్నాం”, అని ట్వీట్ పెట్టింది.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు