కరోనాలో కొత్త స్ట్రెయిన్ : విమానాప్రయాణాలపై నిషేధం విధించిన ఇండియా

india bans flights from uk or britain

యూకే లో కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ పుట్టుకొచ్చిన నేపథ్యంలో అన్ని దేశాలు యూకేతో కనెక్టివిటీనీ కట్ చేసుకుంటున్నాయి. దేశంలో వ్యాక్సిన్ ఇవ్వడం మొదలైన కొన్ని రోజుల తర్వాత కరోనా వైరస్ మరో విధంగా రూపాంతరం చెంది సాధారణ కరోనా వైరస్ కంటే 70 శాతం అధిక వేగంతో వ్యాపించడం మొదలైంది.

తమ వద్ద వైరస్ వేగంగా వ్యాపిస్తుందని యూకే ముందే ప్రకటించడంతో సరిహద్దు దేశాలు అన్ని అప్రమత్తం అయి యూకేతో ఉన్న అన్ని రవాణా మార్గాలను పూర్తిగా మూసివేశాయి. విమాన ప్రయాణాల ద్వారా ఈ వైరస్ భారత్ లో ప్రవేశించే అవకాశం ఉన్నందున ముందుగానే స్పందించిన భారత ప్రభుత్వం యూకే నుండి వచ్చే అన్ని విమానాలపై ముందుగానే నిషేధం విధించింది.

యూకే నుండి వచ్చే విమానాలపై ఈ నిషేధం డిసెంబర్ 21 నుండి డిసెంబర్ 31 2020 అర్థరాత్రి వరకు కొనసాగుతాయని కేంద్రప్రభుత్వం వెల్లడించింది. ఇక డిసెంబర్ 22 కంటే ముందు ఇండియాలో అడుగుపెట్టిన ప్రతి ఒక్క విమాన ప్రయాణికుడు తప్పకుండా RT-PCR టెస్టులు చేయించుకోవాలని సూచించింది.

ప్రస్తుతం యూకే లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించామాని, డిసెంబర్ 31 2020న ఉన్న పరిస్థితులను బట్టి తదుపరి నిర్ణయం వెల్లడిస్తామని భారత విమానయాన మంత్రిత్వశాఖ వెల్లడించింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు