ఆయుర్వేదానికి ప్రపంచ స్థాయి గుర్తింపు : భారత్ లో WHO ప్రపంచ స్థాయి ఆయుర్వేదిక్ సెంటర్

who to setup global hub in india

భారత ఆయుర్వేద వైద్యాన్ని ఈ నాటికి కూడా వ్యతిరేకించే వారు అనేక మంది ఉన్నారు. సైంటిఫిక్ పద్దతి లేదని కొట్టిపారేసే మేధావుల సంగతి అసలు చెప్పాల్సిన పనే లేదు. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది సైంటిస్టులు మన ఆయుర్వేద వైద్యం పై పేటెంట్లు తీసుకుంటుంటే మనం చూస్తే ఊరుకోవాల్సి వచ్చేది.

ఇలా మన ఆయుర్వేదం గురించి అనేక మంది మేధావుల తీరు ఎలా ఉన్నప్పటికి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాత్రం ప్రపంచ స్థాయి సాంప్రదాయ మెడికల్ సెంటర్ ను( Center for traditional medicine )  భారత్ లో ఏర్పాటు చేస్తున్నట్టు  నవంబర్ 13 న అధికారికంగా ప్రకటించింది.

WHO జనరల్ డైరెక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ఈ విషయాన్ని వీడియో ద్వారా వెల్లడించారు. జైపూర్ మరియు జామ్‌నగర్లలలో ప్రధాని మోదీ నేడు ఆయుర్వేద సంస్థలను ప్రారంభిస్తున్న కార్యక్రమంలో టెడ్రోస్ ఈ ప్రకటన చేశారు.

ఇక భారత్ లో ప్రధాని మోదీ నేడు ప్రారంభించిన ఆయుర్వేద సంస్థల్లో విద్యాభోధనతో పాటు ఆయుర్వేదంపై అనేక పరిశోధనలు జరుగుతాయని వెల్లడించారు. ప్రపంచానికి ఫార్మా హబ్ గా ఉన్న భారత్ త్వరలో ప్రపంచానికి ఆయుర్వేద హబ్ గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు