గ్రేటర్ ప్రచారానికి యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, అమిత్ షా

ఈసారి ఆ సంఖ్యను 80 సీట్లకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో సగం...

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు తరలిరావటం సంచలనంగా మారింది. జీహెచ్ఎంసీ అంటే స్థానిక ఎన్నికలు లెక్క.. అలాంటిది ఢిల్లీ నుంచి హైకమాండ్ అగ్రనేతలు అందరూ వస్తుండటం ఆసక్తి రేపుతోంది. బీజేపీ ఎంత ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకుందో అర్థం అవుతుంది.

గ్రేటర్ ఎన్నికల చివరి మూడు రోజులు బీజేపీ అగ్రనేతలు అందరూ హైదరాబాద్ లో రోడ్ షోలు చేయబోతున్నారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 27వ తేదీ పర్యటనకు రానున్నట్లు సమాచారం.

కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత, పార్టీలో నెంబర్ 2 అయిన అమిత్ షా సైతం హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని.. రోడ్ షోలు చేయబోతున్నారు.

మరో కీలకం, సంచలన విషయం ఏంటంటే.. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ హైదరాబాద్ వస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. చివరి రోజుల ఆయన టూర్ హైలెట్ కాబోతున్నది.

గ్రేటర్ హైదరాబాద్ లోని 24 నియోజకవర్గాల పరిధిలో 150 డివిజన్లలో ఎన్నికలను.. బీజేపీ చాలా చాలా సీరియస్ గా తీసుకుని ముందుకు వెళుతుంది.

2016 ఎన్నికల్లో బీజేపీ కేవలం నాలుగు సీట్లు మాత్రమే గెలిచింది.. ఈసారి ఆ సంఖ్యను 80 సీట్లకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో సగం 40 సీట్లు సాధించినా విజయం సాధించినట్లు.. కారణం ఏంటంటే.. టీఆర్ఎస్ పార్టీకి 99 మంది ఉన్నారు.. అంటే అధికార పార్టీ బలాన్ని సగం చేసినట్లే కదా…

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు