ఇకపై యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేయడం కష్టమే

ఇకపై యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేయడం కష్టమే

ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా యూ ట్యూబ్, డిజిటల్ మీడియా ఛానల్ల హవా పెరిగిపోయింది. అయితే నిన్న మొన్నటి వరకు ఈ యూట్యూబ్ ఛానెల్ల కంటెంట్ ని గూగుల్, యూట్యూబ్ లు మాత్రమే పర్యవేక్షింగా, తాజాగా కేంద్రం ఆన్‌లైన్‌ పోర్టల్స్‌పై కన్నేసింది. సమాచార ప్రసార శాఖ నియంత్రణ పరిధిలోకి ఆన్‌లైన్‌ న్యూస్‌ పోర్టల్స్‌, కంటెంట్‌ అందించే సంస్థలను తీసుకువస్తూ ఆదేశాలు జారీ చేసింది.

తాజాగా విడుదలైన ఈ ఆదేశాలపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సోమవారం సంతకం చేశారు. నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్‌ తదితర సంస్థలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి చేరినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇక ఎవరైనా కొత్తగా ఆన్‌లైన్ ఛానల్స్‌ ను ఓపెన్‌ చేయాలనుకుంటే కేంద్రం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఓటీటీ లేదా వివిధ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా సినిమాలు, సిరీస్‌ల తయారీదారులు సెన్సార్‌ బోర్డు నుంచి క్లియరెన్స్‌ సర్టిఫికెట్లు పొందకుండానే కంటెంట్‌ను విడుదల చేస్తున్నారు.

దీంతో ఓటీటీలో అశ్లీల దృష్యాలు పెరిగి యువత, చిన్న పిల్లలు తప్పుదోవ పట్టే అవకాశాలు ఉండడంతో కేంద్రం దీనికి చెక్ పెట్టేవిధంగా ఈ నిర్ణయం తీసుకుంది. కొత్తగా తీసుకువచ్చిన నిబంధనలను ఈ రోజు నుంచే అమలు పరిచేఅవకాశాలు కూడా ఉండనున్నాయి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు