పెద్ద నిర్మాతలకు షాక్ : ఎన్టీఆర్, చెర్రీ, ప్రభాస్, మహేష్.. వీళ్ల సినిమాలకు ఇవే టికెట్ రేట్లు పెడతారా ?

పెద్ద నిర్మాతలకు షాక్ : ఎన్టీఆర్, చెర్రీ, ప్రభాస్, మహేష్.. వీళ్ల సినిమాలకు ఇవే టికెట్ రేట్లు పెడతారా ?

పెద్ద నిర్మాతలకు షాక్ : ఎన్టీఆర్, చెర్రీ, ప్రభాస్, మహేష్.. వీళ్ల సినిమాలకు ఇవే టికెట్ రేట్లు పెడతారా ?

పెద్ద నిర్మాతలకు షాక్ : ఎన్టీఆర్, చెర్రీ, ప్రభాస్, మహేష్.. వీళ్ల సినిమాలకు ఇవే టికెట్ రేట్లు పెడతారా ?

ఒకే ఒక్క దెబ్బతో ఏపీలో సినీ ఇండస్ట్రీ మొత్తం షాక్ అయ్యింది.. ఇన్నాళ్లు ఇష్టానుసారంగా వ్యవహరించిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ధియేటర్ యాజమాన్యాలకు ఇప్పుడు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది.. సీఎం జగన్ ప్రభుత్వం కొట్టిన ఒకే ఒక్క దెబ్బకు.. పెద్ద నిర్మాతలకు షాక్ తగిలిందా అంటే.. అవుననే చెప్పాలి.

పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ మూవీ విషయంలో మొదలైన వివాదం.. ఇప్పుడు అన్ని సినిమాలను వెంటాడుతుంది. గతంలో పెద్ద హీరో సినిమా రిలీజ్ అయ్యింది అంటే.. మొదటి వారం అంతా టికెట్ రేట్లు డబుల్ చేసేవారు. వంద రూపాయల టికెట్.. 200 రూపాయలకు అఫిషియల్ గానే అమ్మేవారు. ఇక థియేటర్ ఓనర్లే చేసే బ్లాక్ టికెట్స్ రేట్ గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు. వారంపాటు ఇలా అమ్మిన తర్వాత.. సాధారణ రేట్లకు విక్రయించేవారు.

ఇక నుంచి ఏపీలో కొత్త సినిమాలు విడుదలైనప్పుడు ఇష్టం వచ్చినట్లు టికెట్ రేట్లు పెంచేసి అమ్మే విధానానికి స్వస్తి పలికింది ప్రభుత్వం. అందరికీ ఒకే ధరలో టికెట్లు అందేలా చర్యలు తీసుకుంది. 24 గంటలపాటు షోలు వేసే విధానానికి అడ్డుకట్ట వేసింది. ఈ నిబంధనలు ఏపీ రాష్ట్రంలో విడుదలయ్యే అన్ని చిన్నా, పెద్దా సినిమాలకు వర్తిస్తాయని స్పష్టం చేసింది.

వకీల్ సాబ్ అయిపోయింది.. రాబోయే సినిమాల సంగతి ఏంటీ.. ఎన్టీఆర్- రాంచరణ్ కాంబోలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ, ప్రభాస్ రాధేశ్యామ్, మహేష్ బాబు సర్కార్ వారిపాట సినిమాలు మరో మూడు నెలల్లో రాబోతున్నాయి. ఇవన్నీ భారీ బడ్జెట్ మూవీస్. ఒక్కో సినిమా బడ్జెట్ వందల కోట్లపైనే ఉంది. ట్రిబుల్ ఆర్ అయితే 300 కోట్లపైనే బడ్జెట్.. ఇంత భారీ బడ్జెట్ సినిమాలకు ఏపీలో టికెట్ రేట్లు 5, 10, 15, 20, 40, 50, 60, 80, 100 రూపాయలుగా పెడితే.. నిర్మాతల పరిస్థితి ఏంటీ.. కలెక్షన్స్ వసూళ్ల ఎప్పటికీ వస్తాయి.. ఇదే ఇప్పుడు సినీ ఇండస్ట్రీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గతంలో మొదటి వారం అంతా డబుల్ రేట్లతోపాటు అన్ని విభాగాలకు అంటే నేల నుంచి బాల్కనీ వరకు ఒకే రేటుతో అమ్మటంతోపాటు.. మొదటి మూడు రోజులు అధిక షోలు.. బెనిఫిట్ షో పేరుతో ఒక్కో టికెట్ ను 500, వెయ్యి, 2 వేల రూపాయల వరకు అమ్మేవారు.

ఏపీ హైకోర్టు విస్తృత ధర్మాసనం సైతం ప్రభుత్వ వాదనను సమర్ధించింది. ఈ పరిణామాలు తెలుగు సినీ నిర్మాతలకు చెమటలు పడుతున్నాయి. రాబోయే పెద్ద సినిమాలకు ప్రభుత్వం నిర్ణయించిన ధరతో.. అధిక షోలు లేకుండా ధియేటర్లలో వేసినట్లయితే టికెట్ కౌంటర్లలో చిల్లరే వస్తుందని.. పెట్టిన వందల కోట్ల పెట్టుబడి ఏంటీ అనే భయం మొదలైంది.

తెలుగు సినీ ఇండస్ట్రీకి ఏపీ అతిపెద్ద మార్కెట్. ప్రతి జిల్లా కేంద్రం కోట్లలో వసూళ్లు రాబడుతుంది. సినీ అభిమానులు, జనం పరంగా ఆరు కోట్ల మంది ఉన్నారు. సినిమా హిట్ అయితే ఏపీ నుంచే అధిక కలెక్షన్స్ వస్తాయి. ఇక నుంచి అన్ని సినిమాలకు ప్రభుత్వ ధరతో టికెట్ అంటే.. ట్రిబుల్ ఆర్, రాధేశ్యామ్, సర్కార్ వారిపాట సినిమా నిర్మాతల పరిస్థితి ఏంటీ..

అప్పటికి సీఎం జగన్ జీవోలో ఏమైనా మార్పులు చేస్తారా లేదా అనేది చూడాలి. ఏదిఏమైనా సినిమా టికెట్ల విషయంలో తెలుగు సినీ ఇండస్ట్రీ ఒక్క మాటంటే ఒక్క మాట మాట్లాడలేదు.. ఎవరికి వారు తేలుకుట్టినోళ్లుగా ఉన్నారు.. మొదటగా ఎవరు నోరు విప్పుతారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు