అన్న తిరుపతి వస్తున్నాడు : ప్రచారానికి సీఎం జగన్ – షాక్ అయిన నేతలు.. కారణాలు ఇవే..

అన్న తిరుపతి వస్తున్నాడు : ప్రచారానికి సీఎం జగన్ - షాక్ అయిన నేతలు.. కారణాలు ఇవే..

అన్న తిరుపతి వస్తున్నాడు.. ప్రచారానికి సీఎం జగన్.. షాక్ అయిన నేతలు.. కారణాలు ఇదే..

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్ కు వచ్చింది. ఏప్రిల్ 16వ తేదీన పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 14వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. ఇప్పటి వరకు అధికార పార్టీ నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రం ప్రచారం చేస్తూ వచ్చారు. గెలుస్తాం.. గెలిచి తీరతాం.. మెజార్టీపైనే దృష్టి అని సవాల్ చేస్తున్నారు. జగన్ అన్న కాదు.. జగన్ అన్న కటౌట్ తో గెలుస్తాం అంటూ ప్రకటనలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు.

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించారు. ఏప్రిల్ 14వ తేదీన తిరుపతిలో ర్యాలీ, సభలో పాల్గొనాలని డిసైడ్ అయ్యారు. ఇదంతా స్వయంగా తీసుకున్న నిర్ణయం అంటున్నారు నేతలు. ముందుగా ప్రచారానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నా.. ఇప్పుడు మనసు మార్చుకున్నారు.

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి సీఎం జగన్ వస్తున్నారన్న సమాచారం తెలిసి తిరుపతి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు షాక్ అయ్యారు. ఊహించని పరిణామంలో అవాక్కయ్యారు. ఇదంతా సీఎం జగన్ స్వయంగా తీసుకున్న నిర్ణయం అంటున్నారు.

దీనికి కారణం లేకపోలేదు. రోజు రోజుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. అన్న కటౌట్ చాలు అంటూ డైలాగ్స్ పేల్చుతున్నారు. తిరుపతిలో గెలుపు ఖాయం అయినా.. మెజార్టీపైనే దృష్టి పెట్టిన క్రమంలోనే.. ఏ మాత్రం అశ్రద్ధ, నిర్లక్ష్యం వహించకుండా.. ఇగోలకు పోకుండా ప్రచారంలోకి దిగాల్సిందే అని డిసైడ్ అయ్యారు సీఎం జగన్. అందుకే పార్టీ నేతలు అవసరం లేదని చెప్పినా.. తిరుపతి వస్తున్నాను అంటూ లేటెస్ట్ డెసిషన్ తీసుకున్నారు.

పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన ధీమా, ఓవర్ కాన్ఫిడెన్స్ పార్టీ నేతల్లో వస్తుంది.. ఇది ప్రత్యర్థులకు అలుసుగా మారకూడదు.. ఒక్కసారి పార్టీ అధినేత ప్రచారానికి వస్తే అంతా సెట్ రైట్ అవుతారు అన్న ఉద్దేశంతోనే సీఎం జగన్ తిరుపతి ఎన్నికల ప్రచారంలోకి దిగుతున్నారు.

ఇప్పుడు తిరుపతి ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్లోగన్ మారిపోయింది. అన్న తిరుపతి వస్తున్నాడు అంటున్నారు.. ఏప్రిల్ 14వ తేదీ ర్యాలీ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి అంటున్నారు కార్యకర్తలు, అభిమానులు.

See also :ఓరి దుర్మార్గుడా.. రూ.5 లక్షల నోట్లు తగలబెట్టిన అవినీతి ఎమ్మార్వో బినామీ

See also :షర్మిల సంకల్ప సభకు విజయమ్మ, భారతి

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు