షర్మిళ సీఎం కేసీఆర్ పై డైరెక్ట్ ఎటాక్ : కేసీఆర్ అవినీతి ప్రశ్నించడానికే మన పార్టీ

షర్మిళ సీఎం కేసీఆర్ పై డైరెక్ట్ ఎటాక్ : కేసీఆర్ అవినీతి ప్రశ్నించడానికే మన పార్టీ

డైరెక్ట్ విషయంలోకి వస్తే, ఖమ్మం వేదికగా సభను నిర్వహించిన వైయస్. షర్మిళ పూర్తి స్థాయిలో దూకుడుగా వ్యవహరించారు. స్పీచ్ మొదలు పెట్టడంతోనే నేరుగా సీఎం కేసీఆర్ అవినీతిని ప్రశ్నించడం మొదలు పెట్టింది వైయస్. షర్మిళ. ఒకటికి పదిసార్లు దొర,దొర అంటూ… తెలంగాణ దొర చెప్పు కింద ఉంది అంటు ఒకటికి పదిసార్లు నొక్కి మరి చెప్పారు షర్మిళ.

వై.యస్.ఆర్ 30 వేల కోట్లతో ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు, తల తోక కత్తిరించి లక్షా ముప్పై వేల కోట్ల రూపాయల అవినీతి కేసీఆర్ చేశారని డైరెక్ట్ అటాక్ చేశారు. బరా..బర్ తెలంగానలో నిలబడుతా,తెలంగాణ ప్రజల కోసం కొట్లాడతా .. నాకు అవకాశం ఇవ్వాలో లేదో ప్రజలు చూసుకుంటారని వెల్లడించారు. సింహం సింగిల్ గానే వస్తుంది అనే డైలాగ్ సైతం కొట్టారు చెప్పారు.

ఇది ఒక్కటే కాదు ఉద్యోగాలు, అవినీతి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, పేద విద్యార్థులు, యువకులు, ఉచిత వైద్యం ఇలా అన్ని చోట్ల తప్పులు ఉన్నాయి.. ఏమైంది సీఎం సారు అంటూ కౌంటర్లు వేశారు. సచివాలయానికి రాని ముఖ్యమంత్రి దేశంలో ఒక్క కేసీఆర్ మాత్రమే అన్న షర్మిళ,అక్కడితో ఆగకుండా తాను రాని సచివాలయం ఎందుకు అనుకున్నాడో ఏమో దాన్ని కూల్చివేశాడు అని అనేసింది.

రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణలో రెండొ స్థానంలో ఉంది, ఉద్యోగాలు లేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని మొదలు పెట్టిన షర్మిళ, ఇటీవల జరిగిన లాయర్ హత్య, గిరిజన మహిళన కొట్టిన వైనం, ఆత్మ హత్య చేసుకున్న రైతు కుటుంబం.. ఇలా ఇటీవల జరిగిన అన్ని సంఘటనల ప్రస్తావించిన షర్మిళ, ఇన్ని జరుగుతున్న దున్నపోతు పై వర్షం పడినట్టు ఉందని వ్యాఖ్యానించారు షర్మిళ.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు