షర్మిల పిల్లలు వీళ్లే.. పార్టీ సభకు హాజరు..

షర్మిల పిల్లలు వీళ్లే.. పార్టీ సభకు హాజరు..

షర్మిల పిల్లలు వీళ్లే.. పార్టీ సభకు హాజరు..

వైఎస్ షర్మిల కొత్త పార్టీ ప్రకటన గ్రాండ్ గా సాగింది. హైదరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాలులో జూలై 8వ తేదీ ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ సభకు కుటుంబం కలిసి వచ్చింది షర్మిల.

తల్లి విజయమ్మ రాక ఎవరికీ ఆశ్చర్యానికి గురి చేయకపోయినా.. తన ఇద్దరు పిల్లలను తీసుకురావటం హైలెట్ గా నిలిచింది. కొడుకు రాజారెడ్డి, కుమార్తె అంజలిలు తల్లితో కలిసి తాత వైఎస్ఆర్ కు నివాళులర్పించారు.

సభ వేదిక ఎదుట భర్త అనిల్, కొడుకు రాజారెడ్డి, కుమార్తె అంజలితోపాటు షర్మిల, విజయమ్మ అందరూ వరసగా కూర్చుకున్నారు. వైఎస్ షర్మిల తన ఇద్దరు పిల్లలను బయటకు.. అందులోనూ రాజకీయ సభకు తీసుకురావటం ఇదే. షర్మిల పిల్లలను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. మీడియా సైతం పదేపదే పిల్లలను చూపిస్తూ ఉంది.

షర్మిల తన కుమారుడికి.. తన తాత రాజారెడ్డి పేరు పెట్టింది. వైఎస్ బతికున్నప్పుడు కూడా తరచుగా మనవడితో ఆడుకునే ఫొటోలు, వీడియోలు వచ్చేవి. తన తండ్రి రాజారెడ్డి పేరును.. వైఎస్ తన మనవడికి పెట్టుకున్నారు.

వైఎస్ జగన్ కు ఇద్దరు కుమార్తెలే.. షర్మిలకు ఒక కుమారుడు, కుమార్తె. వైఎస్ఆర్ మనవళ్లు, మనమరాళ్లలో రాజారెడ్డి ఒక్కడే మనవడు కావటం విశేషం.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు