బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ చేయాల్సిన ప‌నిని.. ష‌ర్మిల చేస్తుంది.. అన్న కంటే ఫాస్ట్ గా ఉన్న చెల్లెలు

బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ చేయాల్సిన ప‌నిని.. ష‌ర్మిల చేస్తుంది.. అన్న కంటే ఫాస్ట్ గా ఉన్న చెల్లెలు

ys sharmila deeksha at indira park
ys sharmila deeksha at indira park

బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ చేయాల్సిన ప‌నిని.. ష‌ర్మిల చేస్తుంది.. అన్న కంటే ఫాస్ట్ గా ఉన్న చెల్లెలు

తెలంగాణ అంటే టీఆర్ఎస్ పార్టీ.. దానికి ప్ర‌త్య‌ర్థులుగా కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం, జ‌న‌సేన పార్టీలు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇవే చూశాం. రాష్ట్ర ఏర్పాటు త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన టీఆర్ఎస్ పార్టీ.. ఏడుళ్లుగా అధికారంలో కొన‌సాగుతూ వ‌స్తుంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్, టీడీపీల‌ను క‌నుమ‌రుగు చేసిన టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు కొత్త రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి బీజేపీగా మారింది. క‌మ్యూనిస్టులు అయితే దాదాపు మాయం అయ్యారు. జ‌న‌సేన పార్టీ పొత్తు దిశ‌గా ఉనికి చాటుకుంటూ ఉంటుంది.

స‌రిగ్గా ఈ స‌మ‌యంలోనే వ‌చ్చిన వైఎస్ ష‌ర్మిల‌.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్ర‌క‌టించి.,. ఏకంగా రంగంలోకి దిగారు. ఏకంగా టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ.. ఎన్నిక‌ల ర‌ణ‌రంగంలోకి దిగారు. ఖ‌మ్మం బ‌హిరంగ స‌భ ముగిసిన వెంట‌నే.. స‌రికొత్త వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌తో.. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు షాక్ ఇస్తున్నారు.

ఏప్రిల్ 15వ తేదీ నుంచి 17వ తేదీ వ‌ర‌కు అంటే.. మూడు రోజులపాటు.. హైద‌రాబాద్ ఇందిరాపార్క్ ద‌గ్గ‌ర దీక్ష చేప‌డుతున్నారు వైఎస్ ష‌ర్మిల‌. నిరుద్యోగులను టార్గెట్ చేస్తూ.. ల‌క్షా 91వేల ఉద్యోగాల‌ను ఎప్పుడు భ‌ర్తీ చేస్తారంటూ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తూ.. వైఎస్ఆర్ తెలంగాణ నిరుద్యోగ స‌మ‌ర శంఖం పూరించారు.

దీని కోసం భారీ ఎత్తున జిల్లాల నుంచి నిరుద్యోగులు సంఘీభావం ప్ర‌క‌టించే విధంగా ప్ర‌చారం మొద‌లుపెట్టారు. ఏదో బ‌హిరంగ స‌భ‌తో చ‌ప్ప‌బ‌డ‌తారు.. మ‌ళ్లీ జూలై వ‌ర‌కు ఏదో ఒక ర‌కంగా నెట్టుకొస్తారు అనుకుంటున్న వారికి ఇది ఊహించ‌ని షాక్.

నిరుద్యోగ స‌మ‌ర శంఖం ద్వారా యువ‌త‌ను పార్టీ వైపు ఆక‌ర్షించేందుకు స‌న్నాహాలు చేస్తుంది. అందులో భాగంగా 15, 16, 17 తేదీల్లో ఇందిరాపార్క్ ద‌గ్గ‌ర దీక్ష చేప‌డుతున్నారు ష‌ర్మిల‌.

ష‌ర్మిల స్పీడ్ చూస్తున్న వాళ్లు అయితే.. అమ్మో.. అన్న కంటే చాలా ఫాస్ట్ గా ఉన్నారు చెల్లెలు అంటున్నారు

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు