షర్మిల పార్టీ పెడుతుంది.. వర్షం పడుతుంది.. వైఎస్ఆర్ ఆశీర్వాదమే అంటున్న అభిమానులు

షర్మిల పార్టీ పెడుతుంది.. వర్షం పడుతుంది.. వైఎస్ఆర్ ఆశీర్వాదమేనా..

తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెడుతున్న క్రమంలో.. ఏప్రిల్ 9వ తేదీ ఖమ్మంలో భారీ బహిరంగ సభ ద్వారా పార్టీ ప్రకటన, జెండా ఆవిష్కరణ, ఎజెండా ప్రకటిస్తున్న క్రమంలో.. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే 40 డిగ్రీల ఎండతో చుక్కలు చూపించిన సూర్యుడు ఒక్కసారిగా చల్లబడిపోయాడు. ఏప్రిల్ 8వ తేదీ గురువారం అయితే కూల్ వెదర వచ్చింది. అంతేనా.. హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా చిరు జల్లులు పడ్డాయి.

షర్మిల సభ జరిగే ఖమ్మం పట్టణంలో అయితే నిన్నటి వరకు మండే ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కనీసం 39 నుంచి 41 డిగ్రీల వరకు టెంపరేచర్ నమోదు అయ్యింది. ఏప్రిల్ 8వ తేదీ అనూహ్యంగా 34 డిగ్రీలకు టెంపరేచర్ పడిపోయింది. కూల్ వెదర్ ఉంది. ఇక ఏప్రిల్ 9వ తేదీ షర్మిల సభ జరిగే రోజు సైతం.. 34 నుంచి 36 డిగ్రీలుగానే ఉష్ణోగ్రత నమోదు అయ్యే అవకాశం ఉందని చెబుతోంది వాతావరణ శాఖ. అంతేకాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ చిరుజల్లులు పడే సూచనలు చెప్పింది వెదర్ రిపోర్ట్.

ఖమ్మం ప్రజల్లోనే కాదు.. ఇప్పుడు తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సైతం ఇదే చర్చ జరుగుతుంది. నిన్నటి వరకు ఎండ ఉక్కబోతతో అల్లాడిపోయాం. ఎండ దెబ్బకు జనం వస్తారో లేదో.. అనుకున్నట్లు సక్సెస్ అవుతుందో లేదో అనే భయం ఉండేది.. ఇప్పుడు చూడండి.. ఏకంగా 5 డిగ్రీలు టెంపరేచర్ తగ్గిపోయింది.. కూల్ వెదర్ వచ్చింది.. వైఎస్ఆర్ అంటే వర్షం అయ్యా.. వైఎస్ఆర్ పార్టీలోనే వరుణ దేవుడు ఉంటాడని నిరూపించాడు దేవుడు అంటున్నారు.

గతంలోనూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొలిసారి సీఎం అయినప్పుడు కూడా భారీ వర్షాలతో ఉమ్మడి రాష్ట్రం జలకళను సంతరించుకుంది. ఆ తర్వాత జగన్ సీఎం అయినప్పుడు కూడా భారీ వర్షాలు పడ్డాయి. ఇప్పుడు తెలంగాణలో షర్మిల పార్టీ ప్రకటిస్తున్నారు అనగానే.. సూర్యుడు శాంతించి.. వరుణుడు కరుణిస్తున్నాడు అనే టాక్ నడుస్తుంది.

వరుణుడు కరుణిస్తే.. 60 శాతం సమస్యలు తీరినట్లే.. ఎందుకంటే 80 శాతం మంది వ్యవసాయంపైనే కదా ఆదారపడేది.. రైతుకు నీళ్లు ఇస్తే ఇక సమస్య ఏమీ ఉండదు.. సో.. షర్మిల ఈ విధంగా.. వరుణుడి రూపంలో బిడ్డకు వైఎస్ఆర్ ఆశీర్వాదం లభించినట్లే అంటున్నారు.

కూల్ వెదర్.. షర్మిల పార్టీ ఎదుగుదలకు కూల్ గా నిచ్చెన వేసినట్లేనా..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు