వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐరన్ లేడీ షర్మిళ.. తెలంగాణ రాజకీయాల్లోకి వస్తున్నారా..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐరన్ లేడీ షర్మిళ - తెలంగాణ రాజకీయాల్లోకి వస్తున్నారా..తెలంగాణలో బలమైన సామాజిక, రాజకీయంగా ఉన్న అండదండలను అనుకూలంగా మార్చుకోవటానికి.. షర్మిళ రూపంలో

కుటుంబం బలంగా ఉంటే.. కుటుంబంలోని వ్యక్తుల లక్ష్యం తెలిస్తే.. ఒకరి కోసం ఒకరు తెగించి ముందుకు వస్తే.. అందులోనూ ఓ మహిళ అయితే ఎలా ఉంటుందో ఆమె షర్మిళ.. సీఎం జగన్ చెల్లెలు.. మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి గారాల పట్టీ. రాజకీయాల్లో అందరూ జగన్ గెలుపును మాత్రమే చూస్తారు.. తెగింపును చూస్తారు.. అంతకు మించి తెర వెనక బలం, బలగం, ఆయుధం ఎవరూ అంటే కచ్చితంగా షర్మిల అంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు.

వైఎస్ అకాల మరణంతో సొంత పార్టీ పెట్టిన జగన్ ను లేకుండా చేస్తే పార్టీ ఖతం అవుతుందని భావించిన ప్రత్యర్థి పార్టీలు.. జగన్ వెనక మరో శక్తి ఉందని అంచనా వేయలేకపోయారు. ఆమే షర్మిళ.. జగన్ జైలుకు వెళ్లిన తర్వాత పార్టీ బాధ్యతలను నెత్తికెత్తుకుని.. పార్టీని బతికించింది. ప్రాణం పోసి నిలబెట్టింది షర్మిళ అనటంలో సందేహం లేదు.

ఓ మహిళగా.. తెలుగు రాష్ట్రాల్లో 16 జిల్లాల్లో 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయటం దేశచరిత్రలో రికార్డ్. బహుశా ప్రపంచంలోనే ఓ పొలిటికల్ లేడీ.. 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి బతికించింది కాబట్టే అందరూ ఆమెను జగన్ వదిలిన బాణంగా భావించినా.. అతి కొద్ది మంది మాత్రం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐరన్ లేడీ అంటారు.

2012లో షర్మిల పాదయాత్ర ద్వారా పార్టీకి జీవం పోస్తే.. జైలు నుంచి వచ్చిన జగన్ 2014 ఎన్నికలను ఎదుర్కొన్నారు. 67 సీట్లతో ప్రతపక్షంతో ఉన్నారు.. అయినా షర్మిల పార్టీ వ్యవహారాల్లోకి రాలేదు.. జోక్యం చేసుకోలేదు.. పూర్తిగా కుటుంబానికే పరిమితం అయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ప్రచారం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాజకీయాలతో సంబంధం లేనట్లు వ్యవహరించారు.

ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారంట. తెలంగాణ రాజకీయాల్లో ఉన్న స్పేస్ ను అనుకూలంగా మార్చుకోవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ బాధ్యతలు చేపట్టాలని తెలంగాణ నుంచి నాయకులు, కార్యకర్తల ఒత్తిడి వస్తుందంట. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలోనే తెరపైకి వచ్చిన షర్మిళ పొలిటికల్ ఎంట్రీ వార్తలు.. రాబోయే రోజుల్లో నిజం కాబోతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఏపీలో అధికారంలో ఉన్నప్పుడే.. తెలంగాణలో బలమైన సామాజిక, రాజకీయంగా ఉన్న అండదండలను అనుకూలంగా మార్చుకోవటానికి.. షర్మిళ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి పునాది వేయబోతున్నట్లు తెలంగాణలోని ఆ పార్టీ సన్నిహితులు చెబుతున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు