వెనక్కి తగ్గిన షర్మిల : రిలే నిరాహార దీక్షలు వాయిదా

ys sharmila stops her protest over jobs

తెలంగాణ వచ్చాక తమకు న్యాయం జరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఎదురు చూసి మోసపోయ్న యువత కోసం రిలే నిరాహార దీక్షలు చేపట్టిన వైయస్. షర్మిళ కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో వెనక్కి తగ్గారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతుండటంతో పాటు, తెలంగాణలో సైతం నైట్ కర్ఫ్యూ అమల్లో ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు షర్మిళ వెల్లడించారు.

కరోనా సెకండ్ వేవ్ – అందుకే వెనక్కి తగ్గిన షర్మిళ

కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో  కార్యకర్తల, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగ సాధన దీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. ఇది తాత్కళిక వాయిదా మాత్రమేనని పరిస్థితులు చక్కబడిన తరువాత మరో సారి తన పోరాటం కొనసాగుతుందని ఆమె ప్రకటించారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు