తండ్రిని అన్నేసి తిట్లు తిడుతున్నారు కదా.. షర్మిల రియాక్షన్ ఎలా ఉంటుంది

తండ్రిని అన్నేసి తిట్లు తిడుతున్నారు కదా.. షర్మిల రియాక్షన్ ఎలా ఉంటుంది

తండ్రిని అన్నేసి తిట్లు తిడుతున్నారు కదా.. షర్మిల రియాక్షన్ ఎలా ఉంటుంది

వైఎస్ రాజశేఖర్ రెడ్డి గజ దొంగ.. నీటి దొంగ.. వైఎస్ నరరూప రాక్షసుడు అంటూ తెలంగాణ మంత్రి శ్రీనివాసగౌడ్ విరుచుకుపడ్డాడు. తెలంగాణ వెనకబాటు తనానికి కారణం వైఎస్ఆర్ అని.. ఇక్కడి భూములు, ఆస్తులను దోచుకున్నాడని మండిపడ్డారు. అక్రమంగా కేసులు పెట్టి తెలంగాణ ఉద్యమకారులను జైళ్లల్లో పెట్టాడని అలాంటి వ్యక్తిని దొంగ, రాక్షసుడు అనకుండా దొర అని ఎట్లా అంటాం అని ఎదురు ప్రశ్నించారు మంత్రి శ్రీనివాసగౌడ్

వైఎస్ హయాంలో గ్రూప్ 1 పోస్టుల్లో అన్యాయం జరిగిందని.. ఏపీ ఉద్యోగుల పక్షపాతిగా తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం చేశారని విమర్శించారు. మంత్రి శ్రీనివాసగౌడ్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

మంత్రి వ్యాఖ్యలపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత, వైఎస్ కుమార్తె షర్మిల రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది. తండ్రిని నరరూప రాక్షసుడు అని బహిరంగంగానే తిడుతుంటే.. కన్న కూతురు.. తండ్రి పేరుతో తెలంగాణలో పార్టీ పెట్టిన ఆమె ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో చూడాలి.

తెలంగాణకు వైఎస్ఆర్ ఏమైనా న్యాయం చేస్తే.. దాన్ని ఆధారాలతో చెప్పాల్సిన బాధ్యత ఇప్పడు ఆమెపై ఉంది. లేకపోతే శ్రీనివాసగౌడ్ చెప్పిందే నిజం అవుతుంది. తండ్రి వైఎస్ఆర్ నరరూప రాక్షసుడు కాదని ఎలా నిరూపిస్తుంది అనే అంశం ఆసక్తిగా మారింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు